కోస్గి ఖాబ్రస్తాన్-దర్గా కూల్చివేత ప్రయత్నంపై ఆగ్రహం – సీఎం నియోజకవర్గంలో మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని అబ్దుల్ వాహాబ్

YSR Praja News: కొడంగల్ నియోజకవర్గం కోస్గి పట్టణంలో ఖాబ్రస్తాన్ మరియు దర్గా మార్గాన్ని రోడ్ వైండింగ్ పేరుతో కూల్చివేయాలని జరుగుతున్న ప్రయత్నాలను తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహాబ్ తీవ్రంగా ఖండించారు.

 

మతసామరస్యానికి భంగం కలిగించే ఈ చర్యలపై స్పందిస్తూ ఆయన అన్నారు – “ప్రజల మతభావాలను గౌరవించకపోవడం, అధికార పార్టీ నేతలు సమాజంలో చిచ్చుపెట్టేలా ప్రవర్తించడం చాలా విచారకరం. కోస్గిలో ఖాబ్రస్తాన్, దర్గాకు సంబంధించిన మార్గాన్ని రోడ్ పేరుతో తొలగించడం మైనారిటీల మనోభావాలను దెబ్బతీయడమే” అని విమర్శించారు.

 

అలాగే గతంలో కోస్గిలో మస్జిద్‌పై రంగులు చల్లిన ఘటనను గుర్తు చేస్తూ, ఇటీవల కొడంగల్ పట్టణంలో మూడు ఖాబ్రస్తాన్లు, ఒక దర్గా, ఆశీర్ఖాన్ తొలగింపు ఘటనలు చోటుచేసుకున్నాయని, బొమ్రస్పేట్‌లో జంగే షహీద్ దర్గా వద్ద వందల ఏళ్లనాటి పవిత్ర మర్రిచెట్టు తొలగించడాన్ని కూడా నిరసించారు. “ఇది సీఎం గారి సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఇలాంటి చర్యలను అడ్డుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఇవి సీఎం గారికి చెడ్డపేరు తెచ్చే అవకాశముంది. వెంటనే జోక్యం చేసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీల ఉద్యమం తప్పద” అని అబ్దుల్ వాహాబ్ హెచ్చరించారు.

 

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ సాధిఖ్, అధ్యక్షులు సమీయొద్దీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్, అధికార ప్రతినిధి అంజాద్, మండల అధ్యక్షుడు డాక్టర్ మఖ్దూమ్, యువజన అధ్యక్షుడు యాసర్ (అడ్వకేట్), పట్టణ అధ్యక్షుడు గౌస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫహాద్ హుస్సేన్, ఉపాధ్యక్షులు వాసే, కార్యవర్గ సభ్యులు నసీరుద్దీన్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *