
YSR Praja News : అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటనలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ కాలంలోనే కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్న ప్రభుత్వానికి బాధ్యత అనే భావన లేదని విమర్శించారు.
“ఎన్నికల ముందు మందుబాబులకు నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యాప్తికి కారణమయ్యాడు. మందుబాబులకు వెన్నుపోటు పొడిచినట్టే ఇది” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందన్న విషయం ప్రభుత్వానికి పట్టదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
