
YSR Praja News : తాడేపల్లి: విశాఖ ఉక్కు ప్లాంట్ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు, ఇప్పుడు మాట్లాడుతున్న తీరులో విరుద్ధత స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
విశాఖ ఉక్కు ప్లాంట్‌కు సొంత గనులు కల్పించాలనే తీర్మానాన్ని తమ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిందని, ఆ కాలంలో ప్రైవేటీకరణ చర్యలను ఆపి ఉక్కు ప్లాంట్‌ను కాపాడామని జగన్ గుర్తుచేశారు. “ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తాడట.. ఇదెంత అన్యాయం?” అంటూ చంద్రబాబు వైఖరిపై ఆయన మండిపడ్డారు.
ఎస్సైఎఎల్‌కి (SAIL) సొంత గనులు ఉండటం వల్ల లాభాలు వస్తున్నాయని, ఆర్ఎన్ఎల్‌కి (RINL) గనులు లేని కారణంగానే నష్టాలు వస్తున్నాయని జగన్ వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖ ఉక్కు ప్లాంట్ కోసం కాకుండా, మిట్టల్ లాంటి ప్రైవేట్ సంస్థకు మాత్రమే సొంత గనులు ఇవ్వాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
“ప్రైవేట్ కంపెనీల కోసం గనులు అడుగుతారు. కానీ ప్రజల ఆస్తి అయిన విశాఖ స్టీల్ కోసం మాత్రం మౌనం వహిస్తారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం?” అని జగన్ ఆగ్రహం వ్యక్తం చే
శారు.




