
YSR Praja News : హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యాల సంఘం (ఫతి) అల్టిమేటం జారీ చేసింది. ఈ నెల 12లోగా కనీసం వెయ్యి కోట్లు విడుదల చేయాలని, లేని పక్షంలో 13వ తేదీ నుంచి ఆందోళనలకు దిగుతామని ఫతి చైర్మన్ డాక్టర్ ఎన్. రమేష్‌బాబు హెచ్చరించారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాయి. రూ.10 వేల కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ.200 కోట్లే ఇచ్చారని, మిగిలిన బకాయిలపై ప్రభుత్వం మాట తప్పిందని రమేష్‌బాబు విమర్శించారు.
బకాయిలు చెల్లించకపోతే క్లాసులు బహిష్కరించడం, విద్యార్థులతో చలో హైదరాబాద్, చలో సెక్రటేరియట్ వంటి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అక్టోబర్ 12 నుంచి 18లోపు కాలేజీ యాజమాన్యాల సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు.
