YSR Praja News Telugu : న్యూఢిల్లీ:పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో… ఆయనను సమర్థించేందుకు టీడీపీ ఎంపీలు ముందుకు వచ్చారు. రెండు రోజుల క్రితమే ‘ఎక్స్’లో సపోర్ట్ ట్వీట్లు చేస్తూ హైప్ క్రియేట్ చేశారు. అదే కార్యక్రమంలో భాగంగా, సోమవారం రాత్రి టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు, బీకే పార్థసారధి, నాగరాజు, ప్రసాదరావు, లక్ష్మీనారాయణ, మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సాన సతీష్, బీద మస్తాన్‌రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
తాజాగా కేంద్ర మంత్రి ఎల్లో మీడియాను పిలిపించి తనకు అనుకూలంగా పబ్లిసిటీ తెచ్చుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో… టీడీపీ ఎంపీలు ఆ బాధ్యతను స్వీకరించి ఆయన తరఫున మాట్లాడేందుకు ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ… సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలకు పెద్దగా అర్ధం లేదని చెప్పారు. పూర్తిస్థాయి అవగాహన లేకుండా కొంతమంది రామ్మోహన్ నాయుడుపై తప్పుదారి పట్టించేలా కామెంట్లు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
మంత్రిని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, నెట్‌జన్ల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో… “కేంద్ర మంత్రిగా సంబందిత ప్రశ్నలకు రామ్మోహన్ నాయుడే సమాధానం ఇచ్చారు. పార్టీ తరఫున మేం చెప్పాల్సిన మాట మేం చెబుతున్నాం. ప్రతీ వైపు స్పష్టత ఇవ్వడం మా బాధ్యత” అని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రతిస్పందనలతో ఈ వ్యవహారం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది.
YSR Praja News Telugu : తమిళనాడు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. దశాబ్దాలుగా ద్రావిడ పార్టీల (డీఎంకే, అన్నాడీఎంకే) గుప్పిట్లో ఉన్న తమిళ రాజకీయాల్లో…
YSR Praja News Telugu : న్యూఢిల్లీ: విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు (ఇన్-సర్వీస్ టీచర్లు) టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును…