
YSR Praja News : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెనాలి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—
“వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పడే కష్టాలు, బాధలను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరచవచ్చు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోంది. పార్టీ కుటుంబ సభ్యులపై కూటమి నాయకులు, అధికారులు సృష్టిస్తున్న ఇబ్బందులను ఈ బుక్‌లో నమోదు చేస్తే, రేపు జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు ట్రాన్స్‌ఫర్ అయినా, రిటైర్ అయినా వదిలే ప్రసక్తి లేదు. న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకునేలా జగన్ మోహన్ రెడ్డి గారికి ఇది ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.
అలాగే,
“కూటమి నాయకుల అన్యాయాలు, అక్రమాలకు గురైన ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన ఈ డిజిటల్ బుక్ ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి చేరుతుంది. ఇది జగనన్న మనకు ఇచ్చిన ఒక రక్షణ కవచం” అని శివకుమార్ గారు స్పష్టం చేశారు.
