
YSR Praja News: రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం జరిగింది.
ఈ నిరసనను డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైయస్ఆర్ సీపీ విజయనగరం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), రాష్ట్ర కార్యదర్శి కేవీపీ సూర్యనారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రీ నర్సింహమూర్తి, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు బుంగ భానుమూర్తి, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు అవినాష్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ, “ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే ప్రయత్నాలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని, ప్రజల విద్య–వైద్య హక్కులను కాపాడే దిశగా పోరాటం కొనసాగిస్తామని” స్పష్టం చే
శారు.
