
YSR Praja News : ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారూ.. మీరూ, మీ కూటమి ఇంటింటా వెలిగిస్తాం అన్న దీపాల్లో ఏ ఒక్క దీపం అయినా మీ ఈ 18 నెలల పాలనలో వెలిగిందా?” అంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం (అక్టోబర్ 20) దీపావళి సందర్భంగా ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో ఆయన చంద్రబాబు పాలనను తీవ్రంగా విమర్శించారు.
జగన్ పేర్కొన్న వాగ్దానాల జాబితాలో —
1️⃣ నిరుద్యోగులందరికీ నెలకు రూ.3,000 చొప్పున భృతి,
2️⃣ ప్రతి అక్కా చెల్లెమ్మకు నెల నెలా రూ.1,500 (ఏటా రూ.18,000),
3️⃣ 50 ఏళ్లకే పెన్షన్, నెలకు రూ.4,000,
4️⃣ ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20,000 (పీఎం కిసాన్‌కు అదనంగా),
5️⃣ పిల్లలందరికీ విద్యా సాయం – ఏటా రూ.15,000,
6️⃣ ప్రతి ఇంటికీ ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు,
7️⃣ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,
8️⃣ ఉద్యోగుల సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఉన్నాయి.
“ఇవన్నీ వెలగని దీపాలేనా? లేక చేశాం అంటే చేశాం అన్నట్టుగా వెలిగించిన అరకొర దీపాలా? లేక మీరు రాకముందు వరకూ వెలుగుతున్న దీపాలను ఆర్పేశారా?” అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
2019-24 మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో డీబీటీ (Direct Benefit Transfer) ద్వారా ఇంటింటా వెలిగిన సుమారు 30 పథకాలను చంద్రబాబు ప్రభుత్వం ఆర్పేసిందని ఆయన ఆరోపించారు. “ఇప్పటి పరిస్థితుల్లో ప్రజల ఇళ్లలో వెలుగు కాదు, చీకటి నెలకొంది” అని ట్వీట్లో వ్యా
ఖ్యానించారు.
