“పిట్టలదొర మాటల్లా ఉంది మీ మేనేజ్మెంట్” – చంద్రబాబుపై వైఎస్ జగన్ ధాటిగా

YSR Praja News : అమరావతి: మోంథా తుపాన్ మేనేజ్మెంట్‌లో సీఎం చంద్రబాబు మాటలు పిట్టల దొరని మైమరపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులకు శ్రీరామరక్షలా నిలిచే ఉచిత పంటల బీమాను రద్దు చేయడం, ఆర్బీకేల నిర్వీర్యం, ఈ-క్రాప్ వ్యవస్థను నీరుగార్చడం, సీజన్‌ వారీగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానాన్ని రద్దు చేయడం వంటి చర్యలు మంచి మేనేజ్మెంట్ అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

 

శనివారం తన ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్టులో వైఎస్ జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తుపానులైనా, వరదలైనా, కరువైనా… వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కలిగించే విధానాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలు చేశామని గుర్తు చేశారు.

 

> “చంద్రబాబు గారూ, తుపాను పరిస్థితులను గొప్పగా మేనేజ్ చేశానంటూ మీకు మీరే గొప్పలు చెప్పుకోవడం పిట్టలదొర మాటల్లా ఉంది. ఉచిత పంటల బీమా రద్దు చేసి, రైతుల గొంతు కోయడం మీ తప్పిదం కాదా?” అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

 

 

 

మోంథా తుపానుతో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, రైతులు పంట బీమా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో 84.8 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా పరిధిలో ఉన్నారని, అందులో 54.55 లక్షల మంది రైతులకు రూ.7,802 కోట్ల పంట నష్ట పరిహారం అందించామని వివరించారు.

 

ప్రస్తుతం రైతులు తమ సొంతంగా ప్రీమియం చెల్లించుకోవాల్సి రావడంతో కేవలం 19 లక్షల మంది రైతులు మాత్రమే బీమా పరిధిలో ఉన్నారని, మిగిలిన రైతులు నిరాశలో ఉన్నారని విమర్శించారు.

 

వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఇలా కొనసాగించారు:

 

> “మీ 18 నెలల పాలనలో 16 సార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో రైతులు నష్టపోయారు. వారికి ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఇది మంచి మేనేజ్మెంట్ ఎలా అవుతుంది?”

 

 

 

అంతేకాక, వైఎస్ జగన్ చంద్రబాబు పాలనలో ఆర్బీకేల నిర్వీర్యం, ఈ-క్రాప్ సిస్టమ్‌ను రద్దు చేయడం, ‘రైతు భరోసా’ పథకాన్ని నిలిపివేయడం వంటి చర్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

 

> “అన్నదాతా సుఖీభవ కింద రైతులకు ఏటా రూ.20,000 ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5,000 మాత్రమే ఇచ్చారు. ఇది మీ మేనేజ్మెంట్ అంటే, రైతు వెన్ను విరగ్గొట్టే మేనేజ్మెంట్,” అని ఆయన ఎద్దేవా చేశారు.

 

 

 

 

 

వైఎస్ జగన్ గుర్తు చేసిన ప్లానింగ్:

 

దేశంలోనే తొలిసారిగా ఆర్బీకేల ఏర్పాటు, విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు సహాయం.

 

ప్రతి గ్రామంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా రైతులకు సేవలు.

 

ఉచిత పంటల బీమా – నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా పరిహారం.

 

ఈ-క్రాప్ సిస్టమ్ ద్వారా పంటల డేటా ఆధారంగా వేగవంతమైన సహాయం.

 

రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ద్వారా గిట్టుబాటు ధరలు రాని రైతులకు సహాయం.

 

 

 

 

“ప్లానింగ్ అంటే ఇదీ చంద్రబాబూ!” అని వైఎస్ జగన్ చివర్లో వ్యాఖ్యానించారు.

మీది మంచి ప్లానింగ్ కాదు, “ఇన్‌సెన్సిటివ్ అండ్ ఇన్‌కాంపిటెంట్ గవర్నెన్స్” మాత్రమేనని విమర్శించారు.

 

“మీ మేనేజ్మెంట్ అంటే ఫోటో షూట్లు, పబ్లిసిటీలు, లేని దానికి గొప్పలు

చెప్పుకోవడమే,”

అని వైఎస్ జగన్ ఎగతాళి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *