Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
తెలంగాణ / Telangana

నిలోజిపల్లి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన అనుముల శ్రీకాంత్ రెడ్డి

October 20, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : నిలోజిపల్లి గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన అనుముల శ్రీకాంత్ రెడ్డి

బోయినపల్లి / రాజన్న సిరిసిల్ల:

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి (దసరా) పండగను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం, నిలోజిపల్లి గ్రామ ప్రజలకు, రూరల్ ప్రాంత ప్రజలందరికీ అనుముల శ్రీకాంత్ రెడ్డి విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చెడుపై మంచి, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి దివ్య రూపం విజయదశమి అని పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక వైభవానికి నిలయమైన మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిలోజిపల్లి గ్రామ ప్రజలందరి జీవితాల్లో దసరా పండుగ కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి, దుర్గామాత ఆశీస్సులతో నిలోజిపల్లి గ్రామం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పాడిపంటలు మరియు సకల ఐశ్వర్యాలతో విలసిల్లాలని కోరుకున్నారు. పండగను గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో, శాంతియుతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు