YSR Praja News Telugu : తాండూర్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి తాండూర్: విజయదశమి దసరా పండుగ సందర్భంగా తాండూర్ పట్టణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలందరూ ఐకమత్యంతో, సోదరభావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. తాండూర్ పట్టణంతో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు
తాండూర్ ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాండూర్ నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని దొరశెట్టి సత్యమూర్తి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలని, తాండూర్ ప్రాంతం మరింత ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ సందర్భంగా ప్రజల్లో కొత్త ఆశలు, సానుకూల ఆలోచనలు కలగాలని, ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో తాండూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ మరోసారి పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

