
YSR Praja News : తెలంగాణ
జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలు విపరీతమైన ఉత్సాహాన్ని సంతరించుకున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటల గడువు ముగిసే సమయానికి వేలాది మంది అభ్యర్థులు ఇంకా క్యూలో ఉండటంతో అధికారులు అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. చివరికి ఆదివారం నాటికి మొత్తం తొలి విడత నామినేషన్ల సంఖ్య స్పష్టత వచ్చింది.
సర్పంచ్ స్థానాలకు భారీ పోటీ
ఈ విడతలో 4,236 పంచాయతీలలో సర్పంచ్ పదవులకు మొత్తం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే:
సూర్యాపేట: 159 పంచాయతీలకు 1,387 నామినేషన్లు (అత్యధికం)
వికారాబాద్: 262 పంచాయతీలకు 1,383
మహబూబాబాద్: 155 పంచాయతీలకు 1,239
కామారెడ్డి: 167 పంచాయతీలకు 1,224
రంగారెడ్డి: 174 పంచాయతీలకు 1,169
వార్డ్ సభ్యుల పోటీ మరింత కఠినం
వార్డు సభ్యుల స్థానాలు విషయంలో పోటీ మరింత తీవ్రంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
రంగారెడ్డి: 1,530 వార్డులకు 4,540 నామినేషన్లు
వికారాబాద్: 2,198 వార్డులకు 4,379
ఖమ్మం: 1,740 వార్డులకు 4,041
కామారెడ్డి: 1,520 వార్డులకు 3,832
సూర్యాపేట: 1,442 వార్డులకు 3,791
తదుపరి షెడ్యూల్ ఇలా…
నామినేషన్ల పరిశీలన: ఇప్పటికే పూర్తయింది
తిరస్కరణలపై అప్పీలు: సోమవారం సాయంత్రం వరకు
అప్పీల్స్ పరిష్కారం: మంగళవారం
నామినేషన్ల ఉపసంహరణ: బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు
ఫైనల్ లిస్ట్ విడుదల: బుధవారం 3 గంటల తర్వాత
పోలింగ్: డిసెంబర్ 11
—
రెండో విడత ఎన్నికలు కూడా స్టార్ట్
రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుంచి ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు దాఖలైన నామినేషన్లపై వివరాలు రావాల్సి ఉంది.
సర్పంచ్ స్థానాలు: 4,333
వార్డులు: 38,350
నామినేషన్ల గడువు: డిసెంబర్ 2 వరకు
ఉపసంహరణ తేదీ: డిసెంబర్ 6
పోలింగ్ & ఫలితాలు: డిసెంబర్ 14న అదే రోజు ఫలితాలు
