YSR Praja News Telugu : తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుముల శ్రీకాంత్ నియామకం రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి మండలం నీలోజుపల్లి గ్రామానికి చెందిన అనుముల శ్రీకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు కాసర్ల అరుణ్ కుమార్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
బీసీ ప్రజల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలపై సంఘం నిరంతరం పోరాటం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనుముల శ్రీకాంత్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా అనుముల శ్రీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్‌కు, జిల్లా అధ్యక్షులు కాసర్ల అరుణ్ కుమార్‌కు, అలాగే తన నియామకానికి సహకరించిన బీసీ సంఘం నాయకులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానని, బీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి, సమాన అవకాశాల కల్పన కోసం సంఘం నాయకులతో కలిసి ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.
జిల్లాలో బీసీ ప్రజా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ, బీసీ వర్గాల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అనుముల శ్రీకాంత్ తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన వెల్లడించారు.

