Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
ఆంద్రప్రదేశ్ / Andra Pradesh • రాజకీయాలు / Politics

కాగితాలపై నిధులు.. కళాశాలల్లో వేధింపులు: విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వ చెలగాటం!

November 17, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : అమరావతి: అబద్ధాలు చెప్పడంలోనూ, ప్రజలను మోసగించడంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆయన తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ పూర్తిగా మించిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాక, కాలేజీల యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుంటే.. ప్రభుత్వ వైఫైయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి లోకేశ్‌ నిస్సిగ్గుగా అబద్ధాల ప్రచారానికి తెరలేపారు. వాస్తవాలను దాచిపెట్టి, సోషల్ మీడియా వేదికగా తప్పుడు లెక్కలతో ప్రజలను నమ్మించేందుకు కుట్ర పన్నుతున్నారనే విమర్శలు విద్యార్థి లోకం నుంచి తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.

అబద్ధాల ప్రచారానికి పరాకాష్ట: రూ. 5 వేల కోట్లు ఇచ్చేశామంటూ విడ్డూరం!

తాము అధికారంలోకి వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024–25 విద్యాసంవత్సరం నుంచి కేవలం రెండున్నర ఏళ్లలోనే దాదాపు రూ. 5 వేల కోట్లు చెల్లించేశామని మంత్రి నారా లోకేశ్‌ సోమవారం తన ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. అంతేకాదు, ప్రతి నెలా క్రమపద్ధతిలో నిధులు విడుదల చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు.

అయితే, ఈ ప్రకటనలోని డొల్లతనం చూసి విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లే పూర్తిస్థాయిలో జరగలేదు. అర్హులైన విద్యార్థులు ఎంతమందో కూడా ఇంకా లెక్కతేలలేదు. అలాంటిది, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఏకంగా రూ. 1,845.63 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇచ్చేశామని చెప్పడం హాస్యాస్పదంగా మారింది. అసలు అడ్మిషన్లే పూర్తికాని విద్యా సంవత్సరానికి నిధులు ఎలా చెల్లించారంటూ విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.

13 త్రైమాసికాలు పెండింగ్‌… వాస్తవాలు ఇవే!

గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు ఎంతో పకడ్బందీగా, క్రమం తప్పకుండా అమలయ్యాయి. కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం కాగితాలకే పరిమితమైంది. ఇక వసతిదీవెన పథకాన్ని అయితే పూర్తిగా ఎత్తేశారు.

విద్యాదీవెన బకాయిలు: 2024 జనవరి–మార్చి త్రైమాసికం నుంచి విద్యాదీవెన నిధులను పెండింగ్‌లో పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల కోడ్‌ రావడంతో కేవలం చివరి ఒక్క త్రైమాసికం మాత్రమే పెండింగ్‌ పడింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చూస్తే మొత్తం 13 త్రైమాసికాలు (క్వార్టర్లు) బకాయి పడ్డారు. ప్రతి క్వార్టర్‌కు రూ. 700 కోట్లు చొప్పున లెక్కగట్టినా, కేవలం విద్యాదీవెన కిందే రూ. 9,100 కోట్లు బాకీ పడ్డారు.

వసతిదీవెన బకాయిలు: ప్రతి ఏటా ఏప్రిల్‌ నెలలో అందించాల్సిన వసతిదీవెనను పూర్తిగా నిలిపివేశారు. 2024, 2025, 2026 ఏప్రిల్‌ నెలల్లో రూ. 1,100 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉండగా.. మూడేళ్లకు కలిపి రూ. 3,300 కోట్లు ఎమెకేశారు.

ఈ రెండూ కలిపి మొత్తం రూ. 12,400 కోట్లు ప్రభుత్వమే విద్యార్థులకు చెల్లించాల్సి ఉంది. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించింది కేవలం రూ. 1,700 కోట్లు ఒకసారి, మరోసారి రూ. 1,100 కోట్లు.. వెరసి రూ. 2,800 కోట్లు మాత్రమే! అంటే ఇంకా నికరంగా రూ. 9,600 కోట్లు ప్రభుత్వమే బాకీ ఉంది. ఇన్ని వేల కోట్ల బకాయిలు పెట్టి కూడా, రూ. 5 వేల కోట్లు ఇచ్చేశామని చెప్పడం పచ్చి మోసం కాక ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

కాలేజీల ఒత్తిళ్లు… బలవన్మరణాల పరంపర

మరోవైపు ప్రభుత్వ మోసపూరిత వైఖరి కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఫీజులు కట్టలేక చదువు మానేయాల్సిన దుస్థితి ఒకవైపు నెలకొంటే, మరోవైపు ఆత్మహత్యలే శరణ్యమంటూ యువత బలవన్మరణాలకు పాల్పడుతోంది.

ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగిన విద్యాశాఖ మంత్రి.. శవ రాజకీయాలు చేస్తూ, పచ్చి అబద్ధాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై విద్యార్థి లోకం భగ్గుమంటోంది. “తండ్రికి తగ్గ తనయుడు… అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించిపోయారు లోకేశ్‌” అంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటినైనా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు మాని, తక్షణమే పెండింగ్‌లో ఉన్న రూ. 9,600 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని సర్వత్రా డిమాండ్‌ వినిపిస్తోంది.

Tags: , , , , , , , , , , , , , ,

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు