కార్మికుల గొంతుక.. పోరాటాల ఊపిరి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు

YSR Praja News Telugu: వికారాబాద్ (వైయస్సార్ ప్రజా న్యూస్): నిరంతరం కార్మికుల పక్షాన నిలబడి, వారి హక్కుల సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఐటీయూ (CITU) వికారాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి పలువురు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, మరియు అభిమానులు నేడు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తూ, ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తున్న ఆయన ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయం. జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి, శ్రమదోపిడీకి వ్యతిరేకంగా ఆయన ముందుండి నడిపించిన పోరాటాలు ఎందరో కార్మికుల జీవితాల్లో భరోసా నింపాయి. ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా శ్రీనివాస్ గారు వికారాబాద్ జిల్లాలో సీఐటీయూ పటిష్టతకు విశేష కృషి చేస్తున్నారు.

అట్టడుగు వర్గాల గొంతుకగా మారి, వారి అభ్యున్నతి కోసం నిరంతరం తపించే ఆయన పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

వైయస్సార్ ప్రజా న్యూస్ ప్రత్యేక శుభాకాంక్షలు:

ఈ సందర్భంగా ‘వైయస్సార్ ప్రజా న్యూస్’ యాజమాన్యం మరియు సిబ్బంది శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్మిక లోకం పట్ల ఆయనకున్న అంకితభావం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ ప్రజా సేవలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.