Khairatabad Ganesh Darshan Ends Sept 23 ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం 23 అర్ధరాత్రి వరకే: 25న వైభవంగా నిమజ్జనం!

Khairatabad Ganesh Darshan Ends Sept 23 ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం 23 అర్ధరాత్రి వరకే: 25న వైభవంగా నిమజ్జనం!

YSR Praja News Telugu : హైదరాబాద్: ఖైరతాబాద్‌ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి భక్తులకు ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుందని కమిటీ సభ్యులు వెల్లడించారు.

24 నుంచి దర్శనాలు నిలిపివేత

నిమజ్జన మహోత్సవానికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున, 24వ తేదీ నుంచి భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. అనంతరం 25వ తేదీ ఉదయం మహాగణపతి నిమజ్జన మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమవుతుందని తెలిపారు.

శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన అధికారులు

25న జరిగే శోభాయాత్రను పురస్కరించుకుని సోమవారం అధికారులు, పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి నిమజ్జన మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాజ్ ధూత్ చౌరస్తా, ఎక్బాల్ మినార్, తెలుగు తల్లి చౌరస్తా, సచివాలయం ముందు భాగం నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే శోభాయాత్ర రూట్‌ను పర్యవేక్షించి, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఈ తనిఖీల్లో పంజగుట్ట, సైఫాబాద్ ఏసీపీలు, ఖైరతాబాద్, సైఫాబాద్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేలా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.