Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
వికారాబాద్ న్యూస్ / Vikarabad News

చాకలి సాయమ్మ కుటుంబానికి ‘కోళ్ల యాదయ్య’ ఆర్థిక సాయం

November 4, 2026 • ysrprajanews

YSR Praja News Telugu :మాచాన్పల్లి (న్యూస్‌లైన్):గ్రామానికి చెందిన చాకలి సాయమ్మ ఇటీవల మృతి చెందగా, శనివారం జాతీయ అంబేడ్కర్ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక వేత్త కోళ్ల యాదయ్య గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు.

​మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి గాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా అంత్యక్రియల నిమిత్తం కోళ్ల యాదయ్య గారు తన వంతు సహాయంగా రూ. 5,000/- (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

​ఈ సందర్భంగా యాదయ్య గారు మాట్లాడుతూ… “ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని, సాయమ్మ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అని తెలిపారు. కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించినందుకు సాయమ్మ కుటుంబ సభ్యులు యాదయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

​ఈ కార్యక్రమంలో మిర్యాల రమేష్, ప్రవీణ్ గౌడ్, చాకలి మల్లేష్, రమేష్, నర్సింహారెడ్డి, రమేష్ మరియు పలువురు గ్రామ నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Tags: , , , , , , , , , , , , , ,

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు