Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
తెలంగాణ / Telangana

సిటీ ప్రయాణికులకు శుభవార్త: టీజీఎస్ఆర్టీసీ ‘వీక్లీ బస్ పాస్’ ప్రారంభం!

October 26, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తీపి కబురు అందించింది. ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించి, ప్రజా రవాణాను మరింత ప్రోత్సహించే లక్ష్యంతో నూతనంగా ‘వీక్లీ బస్ పాస్’ (Weekly Bus Pass) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ ధరను రూ. 600గా నిర్ణయించారు.

ఏడు రోజుల పాటు అపరిమిత ప్రయాణం

ఈ వీక్లీ పాస్ పొందిన ప్రయాణికులు ఏడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఏ ఏ బస్సుల్లో చెల్లుబాటు అవుతుంది?

మెట్రో లగ్జరీ ఏసీ (Metro Luxury AC)

మెట్రో డీలక్స్ (Metro Deluxe)

మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express)

ఆర్డినరీ బస్సులు (Ordinary Buses)

(గమనిక: శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ‘పుష్పక్ ఏసీ ఎయిర్‌పోర్ట్ లైనర్’ బస్సుల్లో మాత్రం ఈ పాస్ చెల్లుబాటు కాదు.)

7 లక్షల మంది పురుష ప్రయాణికులకు ఊరట

ప్రస్తుతం నగరంలో ప్రతిరోజు 25 లక్షల మందికి పైగా ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ‘మహాలక్ష్మి’ పథకం కింద రోజువారీగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న 18 లక్షల మంది మహిళలను మినహాయిస్తే, మిగతా 7 లక్షల మంది పురుష ప్రయాణికులకు ఈ వీక్లీ పాస్ ఎంతగానో ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డెయిలీ (రోజువారీ), మంత్లీ (నెలవారీ) పాస్‌లతో పాటు ఈ కొత్త వీక్లీ పాస్ అదనపు సదుపాయంగా అందుబాటులోకి వచ్చింది.

సద్వినియోగం చేసుకోవాలి: ఆర్టీసీ ఎండీ

ప్రజా రవాణా వ్యవస్థ వినియోగాన్ని మరింత ప్రోత్సహించడంతో పాటు, నగర ప్రయాణికులకు అందుబాటు ధరలోనే మెరుగైన ప్రయాణ సేవలు అందించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ (MD) వై. నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికులందరూ ఈ కొత్త వీక్లీ పాస్ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ వీక్లీ పాస్‌లు నగరంలోని అన్ని ప్రముఖ ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో లభిస్తాయని అధికారులు వెల్లడించారు.

Tags: , , , , , , , , ,

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు