Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
ఆంధ్రప్రదేశ్ • రాజకీయాలు / Politics

ప్రజాస్వామ్యం కాదు.. నారా స్వామ్యం’’: పంచాయతీ ఎన్నికల ఘటనలపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం

November 22, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాదని, ‘నారా స్వామ్యం’ నడుస్తోందని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న అరాచకాలకు సంబంధించిన కొన్ని వీడియోలను సాక్ష్యాలుగా జత చేస్తూ.. ‘హే రామ్.. సేవ్ ఆంధ్ర’ అంటూ నినదిస్తూ, #RiggingMasterCBN హ్యాష్‌ట్యాగ్‌తో శనివారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్టు చేశారు.

వైఎస్ జగన్ పోస్టులోని కీలక అంశాలు:

టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్: మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలతో పాటు ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఎన్నిక ఏదైనా చివరకు మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థనే రిగ్గింగ్ చేస్తున్నారని, దీనిని ‘నారా స్వామ్యం’గా అభివర్ణించారు.

వ్యవస్థల దుర్వినియోగం: నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లను అధికారులే చించేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. పోలింగ్ బూత్‌లను ఆక్రమించి ఓట్లను అపహరించడం, గెలిచిన అభ్యర్థులను ఓడినట్లు ప్రకటించడం వంటివి చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. రిటర్నింగ్ అధికారులు (RO), పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసిస్తున్నారని, నిలువరించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కూడా పచ్చ ముఠాలో కలిసిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శాంతిభద్రతలపై విమర్శలు: గత ఐదేళ్ల తమ పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టు పట్టించారని జగన్ ఆరోపించారు.

బాధితులపైనే తప్పుడు కేసులు:

పంచాయతీ ఎన్నికల వేళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలను జగన్ ఉదాహరణగా ప్రస్తావించారు. ఇవి రాష్ట్రంలో నడుస్తున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలని పేర్కొన్నారు. పెద్దారెడ్డి నివాసంపై వందల మందితో టీడీపీ ఎమ్మెల్యే, అనుచరులు దాడి చేసి, పోలీసుల సమక్షంలోనే హత్యాయత్నానికి పాల్పడ్డారని, వాహనాలకు నిప్పంటించారని ఆరోపించారు. ఇంతటి దారుణాలకు పాల్పడిన వారికి అధికార అండదండలు కల్పిస్తూ, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వైఎస్ జగన్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: , , , , , , , , , , , , , , , , , , , , ,

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు