Monday, 23 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

పులివెందుల నేత హఫీజ్‌కు వైఎస్ జగన్ పరామర్శ: ధైర్యంగా ఉండాలని భరోసా!

October 27, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : కడప కార్పొరేషన్ ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమీక్ష

మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం

వైఎస్సార్ జిల్లా:

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ను పరామర్శించారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా చోటుచేసుకున్న పోలీసుల కాల్పుల ఘటనలో గాయపడిన హఫీజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఫోన్ చేసిన వైఎస్ జగన్, పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఆయనకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, అధైర్యపడకూడదని స్పష్టమైన భరోసా ఇచ్చారు.

దాడులను తట్టుకుని పోటీలో నిలిచారు: కడప నేతలతో భేటీ

అనంతరం కడప కార్పొరేషన్ ముఖ్య నేతలు, నాయకులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక భేటీ నిర్వహించారు. రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

నామినేషన్ల సమయంలో తమ పార్టీ శ్రేణులపై జరిగిన దాడులు, అక్రమ అణచివేత ఘటనలపై ఆయన ఆరా తీశారు. ఎన్ని దాడులు, బెదిరింపులు ఎదురైనప్పటికీ వెనకడుగు వేయకుండా పోరాట స్ఫూర్తితో పోటీలో నిలిచినందుకు నాయకులను, కార్యకర్తలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు.

మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి గెలుపే లక్ష్యం

కడప కార్పొరేషన్‌లో వైఎస్సార్సీపీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించేలా ప్రతీ ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో:

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా

ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్

మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి

మాజీ మేయర్లు సురేష్ బాబు, పాక సురేష్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Tags: , , , , , , , , , , ,

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు