ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

YSR Praja News : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిర్వహించనున్న ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను శనివారం ప్రకటించింది. డిసెంబర్ 11 నుంచి 26 వరకు ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అభ్యర్థులు పరీక్ష ఫీజులను చెల్లించుకోవచ్చని టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలియజేశారు.
తదుపరి తేదీల్లో లేట్ ఫీజుతో కూడా ఫీజు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించారు. ఒక్కో పేపర్‌కు రూ.25 ఫైన్‌తో డిసెంబర్ 27 నుంచి వచ్చే సంవత్సరం జనవరి 2 వరకు, ఒక్కో పేపర్‌కు రూ.50 ఫైన్‌తో జనవరి 3 నుంచి 7 వరకు పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు.
తత్కాల్ విధానంలో జనవరి 8 నుంచి 12 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశాన్ని టాస్ అధికారులు తెలిపారు.
మార్చి/ఏప్రిల్‌–2026లో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను నిర్వహించేందుకు తాత్కాలిక షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *