గిన్నిస్ బుక్‌లో తెలంగాణ బతుకమ్మ వైభవం”

YSR Praja News : తెలంగాణ బతుకమ్మ పండుగ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. మైదానంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల ఎత్తైన భారీ మెగా బతుకమ్మ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది.

 

ఇక, ఆ బతుకమ్మ చుట్టూ పదివేల మంది మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డును సాధించారు. తీరక్క పూలతో అలంకరించిన ఈ అద్భుతమైన బతుకమ్మ చుట్టూ మహిళలు ఉయ్యాల పాటలతో నృత్యాలు చేస్తూ ఆనందంగా పాల్గొన్నారు.

 

ఈ ఘన వేడుకను గిన్నిస్ ప్రతినిధులు స్వయంగా నమోదు చేసి, రికార్డు సాధన ఫలితాలను ప్రకటించారు.

 

ప్రకృతితో మమేకమయ్యే బతుకమ్మ పండుగకు వచ్చిన ఈ ప్రపంచ స్థాయి గౌరవం తెలంగాణ సంస్కృతి వైభవాన్ని మరింతగా ప్రతిష్టత కలిగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *