YSR Praja News : యాదగిరిగుట్ట: దసరా సెలవులు ముగిసిపోతున్న వేళ, సొంత ఊర్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరుగు ప్రయాణంలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.దసరా సెలవులు నేటితో ముగుస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింతగా పెరిగింది. ధర్మ దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతుండగా, వీఐపీ దర్శనానికి సుమారు గంట సమయం వేచి చూడాల్సి వస్తోంది. నిన్న శనివారం రోజున మాత్రమే సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు.
వివిధ పూజల ద్వారా ఆలయ నిత్యాదాయం రూ.41,31,970 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా నూతన తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.




