జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైనల్ నిర్ణయం – నవీన్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఇవాళ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నవీన్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రేసులో ఉన్న బొంతు రామ్మోహన్‌ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

 

బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌ అభ్యర్థిని హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. పార్టీ గెలుపుకోసం నేను పూర్తిగా కట్టుబడి పని చేస్తాను,” అని తెలిపారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

 

హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే విమర్శల మధ్య, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

ఇక మంత్రులు గడ్డం వివేక్‌, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ తో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్‌ చైర్మన్లు, సీనియర్‌ నేతలు క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్న పార్టీ, నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌ పేర్లను పరిశీలించింది. చివరకు సీఎం రేవంత్‌ నవీన్‌ వైపే ఆసక్తి చూపడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది.

 

📍 Tags: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *