
YSR Praja News : హైదరాబాద్: వైఎస్ఆర్సిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగదీశ్వర్ గుప్త ఇంటిని వైయస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్యామల మరియు కారుమూరి వెంకట్ రెడ్డి సందర్శించారు.
ఆదివారం కాప్రాలోని శృంగేరి శంకర మఠంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, రామకృష్ణాపురం లోని జగదీశ్వర్ గుప్తా నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంటి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
తర్వాత మాట్లాడిన శ్యామల మాట్లాడుతూ – “ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పరిపాలనను గాలికి వదిలేసి, అక్రమ కేసులతో కాలం వెళ్ళదీస్తోంది. ప్రజాస్వామ్య విలువలను తుంచిపారేస్తూ, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ పేరుతో పాలన కొనసాగిస్తున్నారు” అని తీవ్రంగా విమర్శించారు.
కారుమూరి వెంకట్ రెడ్డి కూడా మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వైఎస్ఆర్సిపి ఎప్పుడూ నిలబడుతుందని, వైయస్సార్ చూపిన దారిలోనే పార్టీ ముందుకు సాగుతుందని తెలి
పారు.
