కృష్ణా జిల్లా: మోంథా తుపాను బాధిత రైతుల పరామర్శలో వైఎస్ జగన్ పర్యటన – కూటమి ప్రభుత్వ దుర్వినియోగం పై ఆగ్రహం

YSR Praja News : కృష్ణా జిల్లా మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించి, పంట పొలాల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన విశేష విజయవంతమైంది. ప్రజలు భారీగా తరలి వచ్చి తమ బాధలను, సమస్యలను జగన్‌కు వ్యక్తం చేశారు.

 

అయితే, ఈ పర్యటనతో కూటమి ప్రభుత్వం ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. పర్యటనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పై “పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ” కేసు నమోదు చేశారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కూడా కేసులు పెట్టనున్నట్లు పోలీసులు ప్రకటించారు.

 

ఈ చర్యలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతూ, “పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారడం సిగ్గుచేటు” అని తీవ్రంగా విమర్శించారు.

 

🔹 పర్యటన అడ్డుకునేందుకు ముందస్తు చర్యలు

 

వైఎస్ జగన్ పర్యటనకు ముందుగానే పోలీసులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంచార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, గ్రామ నాయకులకు నోటీసులు జారీ చేశారు. ప్రజల సమీకరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ విఫలమయ్యాయి — ప్రజలు స్వచ్ఛందంగా భారీగా హాజరయ్యారు.

 

జగన్ పర్యటన సమయంలో గోపువానిపాలెం అడ్డరోడ్డులో వైఎస్సార్సీపీ నేతలు, రైతులు చేరుకోగా, పోలీసులు బారికేడ్లు, రోప్లు వేసి అడ్డుకున్నారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్నవారినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనిపై కైలే అనిల్ కుమార్ ప్రశ్నించగా, పోలీసులు సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆగ్రహం ప్రదర్శించారు.

 

🔹 నాయకుల అదుపు, బెదిరింపులు

 

వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్ బాబు ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన వాహనాలను స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో, సీతారామపురంలో టीडీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద జెండాలతో కవ్వింపు చర్యలు చేపట్టినా, వైఎస్సార్సీపీ శ్రేణులు అత్యంత సంయమనం పాటించడం గమనార్హం.

 

🔹 వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం

 

పోలీసులు ప్రజల సమస్యలను వినకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం పాపమా? అని ప్రశ్నించారు.

 

ప్రజా సేవ కోసం పర్యటన చేపట్టిన జగన్‌ను అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వ అసహనం, అశక్తత కు నిదర్శనమని వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *