విజ్ఞానం, వినయానికి ప్రతీక అబ్దుల్ కలాం” – వైఎస్ జగన్ ట్వీట్

YSR Praja News : తాడేపల్లి: దేశానికి మిస్సైల్ మ్యాన్‌గా పేరుగాంచిన దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ (Abdul Kalam) జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) నివాళులు అర్పించారు.

 

వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ – “విజ్ఞానం, వినయంతో దేశానికి సేవ చేసిన మూర్తీభవించిన వ్యక్తి అబ్దుల్ కలామ్. విద్యాశక్తిని నమ్మి, కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోవాలంటూ అనేక తరాలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు ఆయన. మెరుగైన భారత నిర్మాణానికి అంకితభావంతో కృషి చేసిన మిస్సైల్ మ్యాన్‌కి నా నమస్కారాలు” అని పేర్కొన్నారు.

 

అబ్దుల్ కలాం జయంతిని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా విద్యార్థులు, శాస్త్రవేత్తలు స్ఫూర్తిదినంగా జరుపుకుంటారు. ఆయన ఆలోచనలు, విజన్ “డ్రీమ్, బెలీవ్, అచీవ్” నేటికీ యువతలో ప్రేరణగా నిలుస్తున్నా

యి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *