
YSR Praja News: ఎన్టీఆర్ జిల్లా:
స్టేషన్ నుండి విడుదలైన అనంతరం వైయస్ఆర్ సీపీ నేత కోమటి కోటేశ్వరరావు, మాజీ మంత్రి జోగి రమేష్ ను, అలాగే పార్టీ లీగల్ సెల్ టీమ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు:
“సామాన్య కార్యకర్త కోసం ఎప్పుడైనా పోరాడతాం. పార్టీ శ్రేణుల ఐకమత్యమే మా పోరాటానికి స్ఫూర్తి. కూటమి నాయకుల అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు. పార్టీ నాయకులు, కార్యకర్తల కోసమే కాకుండా, స్థానిక ప్రజా సమస్యలపై కూడా ఇదే స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తాం” అని జోగి రమేష్ స్పష్టం చేశారు.
—
