YSR Praja News : హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, శనివారం సీఎం రేవంత్ రెడ్డికి ఆమె లేఖ రాశారు.
‘‘సమ్మిట్‌కు పంపిన ఆహ్వానం పట్ల ధన్యవాదాలు. అయితే, అదే రోజుల్లో ముందుగానే నిర్ణయించిన జిల్లాల పర్యటనల కారణంగా కార్యక్రమానికి హాజరు కావడం సాధ్యంకాలేకపోతుంది’’ అని పేర్కొన్నారు.
సమ్మిట్ సందర్భంగా జరిగే చర్చలు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి దోహదపడాలనే ఆకాంక్షను మమత వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ వేదిక ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పురోగతి రూపంలో మంచి ఫలితాలు రావాలని ఆమె లేఖలో పేర్కొన్నారు.
YSR Praja News Telugu : తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఇసుక మాఫియా పంజా విసురుతోంది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ…