ఖమ్మం: స్నానానికి దిగిన లారీ డ్రైవర్ గల్లంతు – పోలీసులు శోధన

YSR Praja News : సాగర్ కాలువలో లారీ డ్రైవర్ గల్లంతు… శోధన కొనసాగుతోంది
ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన లారీ డ్రైవర్ సాగర్ కాలువలో గల్లంతైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హస్నాబాద్ ప్రాంతానికి చెందిన హైమద్ అనే లారీ డ్రైవర్ ఖమ్మంకు సరుకు రవాణా కోసం బయలుదేరాడు. ప్రయాణంలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి ఎన్ఎస్పీ కాలువ వద్ద వాహనాన్ని నిలిపి స్నానం చేయడానికి దిగారు. డ్రైవర్‌తో పాటు అతని సహాయకుడు కూడా కాలువలోకి దిగాడు.
ఈ క్రమంలో ప్రవాహం తీవ్రంగా ఉండడంతో హైమద్ నీటిలో కొట్టుకుపోయాడు. అతన్ని రక్షించే ప్రయత్నం విఫలమయ్యింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికీ అతడి కోసం శోధన కొనసాగుతున్నట్టు వివరించారు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *