గోవా ట్రిప్ లో బ్లాక్‌మెయిల్ గందరగోళం: ప్రేమ జంట వీడియోలతో రూ.30 లక్షల డిమాండ్

YSR Praja News: గోవా ట్రిప్ లో బ్లాక్‌మెయిల్.. భార్య జీవితమే పాడు చేస్తానని బెదిరింపు!
గోవాకు ట్రిప్ కు వెళ్లే జంటలు తప్పనిసరిగా జాగ్రత్తపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. టూర్లు, బస ఏర్పాట్లు చేస్తూ ప్రేమ జంటల వ్యక్తిగత క్షణాలను రికార్డు చేసి, తరువాత వాటిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌ ఎర్రగడ్డకు చెందిన ఒక మహిళ (35) సనత్‌నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 2023లో తన పెళ్లికి ముందుగా ఒక వ్యక్తితో కలిసి గోవా వెళ్లింది. ఆ ట్రిప్ లో వారికి నివాసం, ఇతర సదుపాయాలు కల్పించిన యశ్వంత్ (40) అనే వ్యక్తి ఇటీవల ఆమెకు ఫోన్ చేశాడు.
ఆ సమయంలో వారి వ్యక్తిగత వీడియోలు రహస్యంగా రికార్డ్ చేసానని, వాటిని బయటపెడతానని బెదిరింపులకు దిగినట్లు తెలిపింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని బాధిత మహిళ తెలిపింది. ఇప్పుడు తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని, ఆ వీడియోలు బయటికి వస్తే జీవితమే చెడిపోతుందని వేడుకున్నా, ఒత్తిడి కొనసాగించినట్లు వెల్లడించింది.
అంతర్జాల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు విసుగెత్తిన బాధితురాలు సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యశ్వంత్‌ను అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. గోవా ట్రిప్ పేరుతో ఇలాంటి దందాలు పెరుగుతున్న నేపథ్యంలో జంటలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *