YSR Praja News Telugu : తాడేపల్లి: గుంటూరు నగరంలోని నగరంపాలెం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ సూఫీ సంత్ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా (నల్ల మస్తానయ్య) 134వ ఉరుసు మహోత్సవాలు నేడు భక్తిశ్రద్ధల మధ్య ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను అందజేశారు.
హజరత్ కాలే మస్తాన్ వలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు నేతృత్వంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు తాడేపల్లి నివాసానికి వెళ్లి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బాబాకు సమర్పించాల్సిన చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్‌ను వైఎస్ జగన్ అందజేయగా, ఉరుసు ఉత్సవాలు విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, ధర్మకర్త రావి రామ్మోహనరావు సతీమణి డూండేశ్వరి, బుర్రా సత్యనారాయణ రెడ్డి, తుమ్మూరు షమిత్ సాయి గణేష్ రెడ్డి, రావి జ్ఞానేశ్వర్ బావాజీ మస్తాన్ రావు, గుంటూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో పాటు పలువురు నాయకులు, దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా బాబా దర్గా హిందూ–ముస్లిం సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు ఉత్సవాల్లో అన్ని వర్గాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందుతారు. ఈ ఏడాది ఉరుసు ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
ఉత్సవాల ముగింపు రోజున బాబా ఆశీస్సులైన కుర్చీని యథాస్థానంలో ప్రతిష్ఠించడం ద్వారా ఉరుసు కార్యక్రమాలు అధికారికంగా ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దర్గా కమిటీ వెల్లడించింది.
YSR Praja News Telugu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత…
YSR Praja News : హైదరాబాద్: సాధారణంగా సినిమాల్లోనే చూసే సన్నివేశం నిజంగా నగరంలో చోటుచేసుకుంది. పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీ…