YSR Praja News Telugu : తాండూర్: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి తాండూర్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకేచోట కలుసుకుని ఆనందంగా గడిపే పవిత్రమైన పండుగగా సంక్రాంతి ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు పంటల పండుగగా పేరుగాంచిన సంక్రాంతి, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సమృద్ధి నింపాలని ఆకాంక్షించారు. గ్రామీణ జీవన విధానాన్ని గుర్తు చేస్తూ, పల్లె సంస్కృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యంగా యువత తమ సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
తాండూర్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి కలగాలని కోరుకుంటూ, ఈ పండుగ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరియాలని దొరశెట్టి సత్యమూర్తి తెలిపారు
YSR Praja News: హైదరాబాద్: ఎన్నికల ముందు కౌలు రైతులకు భారీ భరోసాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పట్టించుకోకుండా వదిలేసిందని…
YSR Praja News Telugu : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్య నగరాల్లో అధికార పార్టీతో…
YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆస్తిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలు తీవ్రమైన అనర్థాలకు దారితీస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…