ప్రభాస్ ‘ది రాజా సాబ్’కు ప్రమోషన్ కరువు.. కలెక్షన్లపై ప్రభావం?

ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా జనవరి 9న సంక్రాంతి బరిలో ముందుగానే విడుదలై భారీ అంచనాలు క్రియేట్ చేసింది… YSR Praja News Telugu : ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి బరిలో ముందుగానే విడుదలైంది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజుల్లో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు తొలగించారని, ప్రభాస్ పాత గెటప్‌కు సంబంధించిన సీన్స్ ఉంటే ఇంకా బాగుండేదని అభిమానులు అభిప్రాయపడ్డారు.
ఫ్యాన్స్ సూచనలను సీరియస్‌గా తీసుకున్న దర్శకుడు మారుతి వెంటనే మార్పులు చేసి రెండో రోజే రీ-వర్షన్ విడుదల చేశారు. ఈ మార్పుల తర్వాత సినిమాపై మళ్లీ పాజిటివ్ టాక్ రావడం ప్రారంభమైంది. సాధారణ ప్రేక్షకులు కూడా “ఇప్పుడు సినిమా చాలా ఇంప్రూవ్ అయింది” అని చెప్పడం విశేషం.
అయితే, అదే సమయంలో సంక్రాంతి పండుగకు వరుసగా పెద్ద సినిమాలు విడుదల కావడంతో ‘రాజా సాబ్’ కొన్ని స్క్రీన్స్ కోల్పోయింది. మరోవైపు, సినిమా రిలీజ్ అయిన తర్వాత సరైన ప్రమోషన్స్ లేకపోవడం కలెక్షన్లపై ప్రభావం చూపిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్‌కు ముందు వరకు ప్రచారం బాగానే జరిగినప్పటికీ, పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ లేకపోవడంతో సినిమా బజ్ క్రమంగా తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రభాస్ – దర్శకుల స్పందన కరువు?
సినిమా విడుదల అనంతరం కేవలం ఒక ప్రెస్ మీట్‌తోనే చిత్ర యూనిట్ సరిపెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితమయ్యారు. ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో వీడియో బైట్స్ లేదా ప్రత్యేక ఇంటర్వ్యూలు జరగలేదు. సాధారణంగా ప్రభాస్‌తో కలిసి పనిచేసిన రాజమౌళి, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సుజీత్ వంటి స్టార్ డైరెక్టర్లు సోషల్ మీడియాలో సినిమా గురించి స్పందిస్తే మరింత హైప్ వచ్చేదని అభిమానులు భావిస్తున్నారు.
కానీ ఈసారి ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన లేకపోవడం సినిమాకు కొంత డ్యామేజ్ చేశిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రీకట్ తర్వాత సినిమా బాగుందని కామన్ ఆడియన్స్ చెబుతున్నా, ఆ మాట బయటికి బలంగా వెళ్లేలా ప్రమోషన్ జరగకపోవడమే ప్రధాన లోటుగా కనిపిస్తోంది.
నిర్మాత SKN హైప్ – ఆ తర్వాత నిశ్శబ్దం
సినిమా విడుదలకు ముందు నిర్మాత ఎస్‌కేఎన్ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు. “రాజా సాబ్ పండగ” అంటూ ప్రమోషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కానీ సినిమా రిలీజైన తర్వాత ఆయన కూడా పెద్దగా ప్రమోషన్లలో కనిపించలేదు.
గతంలో ‘రాధేశ్యామ్’ ఫ్లాప్ సమయంలో సంగీత దర్శకుడు తమన్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్ చేసి సినిమాపై ఆసక్తిని నిలబెట్టారు. ఇప్పుడు కూడా కనీసం తమన్, మారుతి, ఎస్‌కేఎన్‌తో పాటు హీరోయిన్లను రంగంలోకి దింపి వీకెండ్ వరకు ప్రమోషన్ చేస్తే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ‘రాజా సాబ్’ వసూళ్లు దాదాపు రూ.220 కోట్లకు చేరువలో ఉన్నట్లు సమాచారం. సరైన ప్రచారం జరిగితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *