TSMHPS నిజామాబాద్ పట్టణ కన్వీనర్‌గా నదీమ్ అహ్మద్ నియామకం

YSR Praja News Telugu : నిజామాబాద్: తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS) నిజామాబాద్ పట్టణ నూతన కన్వీనర్‌గా యువ నాయకుడు శ్రీ నదీమ్ అహ్మద్ గారిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జనాబ్ అబ్దుల్ వాహాబ్ గారు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

సంఘం విధివిధానాలకు కట్టుబడి పనిచేస్తూ, మైనార్టీల సమస్యల పరిష్కారంలో నదీమ్ అహ్మద్ చేస్తున్న నిరంతర కృషిని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో సంఘాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, మైనార్టీల న్యాయమైన హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించాలని నూతన కన్వీనర్‌కు సూచించారు.

ఈ సందర్భంగా నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్ గారికి మరియు రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ పట్టణంలోని మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, సంఘం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ నియామకం ద్వారా TSMHPS కార్యకలాపాలు మరింత వేగవంతమై, మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణకు బలమైన వేదికగా నిలుస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇట్లు,

కార్యాలయం నుండి

తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *