
YSR Praja News : పూటోని గూడ గ్రామ సర్పంచ్ చప్లి భాస్కర్ నాయక్‌కు ఘన సన్మానం
రంగారెడ్డి జిల్లా, కేశంపేట్ మండల పరిధిలోని పూటోని గూడ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ చప్లి భాస్కర్ నాయక్‌కు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాత్లావత్ రవి నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చప్లి భాస్కర్ నాయక్‌ను సేవాలాల్ మహారాజ్ ఫోటో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన అధ్యక్షులు సచిన్ నాయక్, కేశంపేట్ మండల ఉపాధ్యక్షులు నేనావత్ రవి నాయక్, స్టార్ యూత్ అధ్యక్షులు రాజు నాయక్‌తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాత్లావత్ రవి నాయక్ మాట్లాడుతూ…
గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్, ఉపసర్పంచ్లు సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి సేవాలాల్ సేన తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు




