
YSR Praja News Telugu : వాల్మీకినగర్‌కు చెందిన బోయ్యా వెంకటయ్య గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మాతృమూర్తి శ్రీమతి బోయ్యా అనంతమ్మ గారు అనారోగ్యంతో శనివారం (తేదీ 14-03-2026) సాయంత్రం 05:30 గంటలకు స్వర్గస్తులయ్యారు. ఆమె మృతి పట్ల వాల్మీకినగర్ వాసులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
అనంతమ్మ గారి అంత్యక్రియలు ఈరోజు (ఆదివారం, 15-03-2026) మధ్యాహ్నం 01:00 గంటలకు వాల్మీకినగర్‌లో అశ్రునయనాల మధ్య ముగిశాయి.
కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రముఖులు:
మాతృ వియోగానికి గురైన బోయ్యా వెంకటయ్య గారి కుటుంబ సభ్యులను పలువురు ప్రముఖులు స్వయంగా కలిసి పరామర్శించారు. RBOL (ఆర్బీవోఎల్) సీఈఓ శ్రీ బుయ్యాని శ్రీనివాస్ రెడ్డి గారు వెంకటయ్య గారి నివాసానికి చేరుకుని అనంతమ్మ గారి భౌతికకాయానికి నివాళులర్పించారు.
వారితో పాటు వాల్మీకినగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి గారు, భరత్ రెడ్డి, కోటం లింగం, రాజేష్ గౌడ్, సిద్దు మరియు సాయికుమార్ తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో వెంకటయ్య గారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు.




