YSR Praja News Telugu : మాచాన్ పల్లి: గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబానికి జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త శ్రీ కోళ్ళ యాదయ్య గారు అండగా నిలిచి తన ఉదారతను చాటుకున్నారు. మాచాన్ పల్లి గ్రామానికి చెందిన సాంబి బాలమణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త తెలుసుకున్న కోళ్ళ యాదయ్య తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
కుటుంబ పెద్దను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన, అత్యవసర సమయంలో ఆదుకోవాలనే సదుద్దేశంతో బాలమణి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 5,000/- ల నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకోవడంలో తాను ఎప్పుడూ ముందుంటానని, సామాజిక బాధ్యతగా ఈ సాయం చేసినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కోళ్ళ యాదయ్య గారితో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కలాల్ ప్రవీణ్ గౌడ్, స్థానిక వార్డు మెంబర్ శ్రీవాణి రమేష్, కోళ్ల పాండు తదితరులు మృతురాలి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి మనోధైర్యాన్ని కల్పించారు.
ఊహించని కష్టసమయంలో, చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో తమకు అండగా నిలిచి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించిన శ్రీ కోళ్ళ యాదయ్య గారికి, మరియు అండగా నిలిచిన ఇతర నాయకులకు మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పేదల పట్ల ఆయన చూపుతున్న ఆదరణను పలువురు గ్రామస్తులు కొనియాడారు.
YSR Praja News Telugu : కొడంగల్ కేంద్రంగా మైనార్టీల రాజకీయ హక్కులపై గళమెత్తిన టీఎస్ఎంహెచ్పీఎస్ రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన…