YSR Praja News Telugu : రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న అంజన్నకు ఆయన జన్మదినం సందర్భంగా సివిల్ ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అనుముల శ్రీకాంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. హెడ్ కానిస్టేబుల్ అంజన్న ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తూ పోలీస్ శాఖలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరుకున్నారు.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని, నిరంతరం ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారుల పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంజన్నకు శ్రీకాంత్ రెడ్డి మరోసారి జన్మదిన అభినందనలు తెలియజేశారు.

