ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

నకిలీ మద్యం కేసులో వాస్తవాలను సీబీఐ బయటకు తీయాలి: ఆర్కే రోజా

YSR Praja News: నగరి: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు (AP Liquor Case)పై సీబీఐ దర్యాప్తు జరిపి వాస్తవాలను, కమీషన్లను బయటకు తీయాలని మాజీ మంత్రి…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

బిహార్ రాజకీయాల్లో మజ్లిస్ హల్‌చల్ — 100 స్థానాల్లో పోటీకి సిద్ధం!

YSR Praja News : పాట్నా: “ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్థియై” అన్నట్లుగా 1969లో హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో పత్తరట్టీ డివిజన్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆశ్రయం – బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

YSR Praja News : హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ విడుదల…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

ఉల్లి రైతులపై కూటమి నిర్లక్ష్యం – వైఎస్ అవినాష్ రెడ్డి

YSR Praja News : కడప: ఉల్లి ధర దారుణంగా పడిపోతున్నా, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ఉల్లి…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

హైదరాబాద్‌లో హైడ్రా సర్జ్‌ – బంజారాహిల్స్‌లో ₹750 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

YSR Praja News Telugu : హైదరాబాద్: నగరంలో హైడ్రా (HYDRA) అధికారుల కూల్చివేత చర్యలు వేగం పుంజుకున్నాయి. బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలో శుక్రవారం ఉదయం…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే: ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక భేటీ

YSR Praja News Telugu : హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడం, తదనంతరం రాష్ట్ర…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ రోజు నోటిఫికేషన్…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల (లోకల్ బాడీ) ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నట్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (అక్టోబర్ 9) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ యత్నాలను ఎండగట్టారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని “పేదలపై ద్రోహం”గా అభివర్ణించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ – > “మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకువచ్చాం. పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించడమే మా లక్ష్యం. కోవిడ్ సమయంలో కూడా నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేది.” అలాగే ఆయన తెలిపారు – > “విజయనగరం, పాడేరు వంటి కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తయ్యాయి, ఐదింట్లో 2023–24లో క్లాసులు మొదలయ్యాయి. ఇవన్నీ పేద పిల్లలకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు. అలాంటి సంస్థలను చంద్రబాబు అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.” చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. > “అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి రోడ్లు, డ్రైనేజీలకు లక్షకోట్లు ఖర్చు చేయాలనుకుంటున్న చంద్రబాబు… పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా?” అని ప్రశ్నించారు. స్పీకర్‌పై కూడా వైఎస్ జగన్ ఘాటుగా విరుచుకుపడ్డారు. > “జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెబుతున్న స్పీకర్ తన పదవికి అర్హుడా?” అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేశారని జగన్ ఆరోపించారు. — ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ “కోటి సంతకాల ఉద్యమం” ప్రారంభిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. 📅 అక్టోబర్ 10 – నవంబర్ 22: రచ్చబండలు, సంతకాల సేకరణ 📅 అక్టోబర్ 28: నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు 📅 నవంబర్ 12: జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు 📅 నవంబర్ 23: సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలింపు 📅 నవంబర్ 24: గవర్నర్‌కి సంతకాల పత్రాల సమర్పణ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు – > “పేదల వైద్య హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.”

YSR Praja News Telugu : నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నట్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

సుప్రీంకోర్టులో షూ ఘటనపై సంచలనం – లాయర్ రాకేష్ కిషోర్‌పై బార్ అసోషియేషన్ బహిష్కరణ

YSR Praja News : న్యాయవ్యవస్థను కుదిపేసిన సుప్రీంకోర్టు షూ ఘటనపై కొత్త మలుపు తిరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన…

నకిలీ మద్యం కేసులో వాస్తవాలను సీబీఐ బయటకు తీయాలి: ఆర్కే రోజా

YSR Praja News:

నగరి: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం కేసు (AP Liquor Case)పై సీబీఐ దర్యాప్తు జరిపి వాస్తవాలను, కమీషన్లను బయటకు తీయాలని మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు.

నగరిలో మీడియాతో మాట్లాడిన ఆమె, “ఏపీలో ఎన్డీఏ అంటే ‘నారా నకిలీ డిస్టిలరీస్ అమ్మడం’ (NDA) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసుపై సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు” అని మండిపడ్డారు.

రోజా మాట్లాడుతూ, “ప్రజలకు మద్యం దూరం చేసి వైఎస్ జగన్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారు. 43వేల బెల్ట్ షాపులను తొలగించారు. కానీ టీడీపీ నాయకులు డెకాయిట్లు, బందిపోట్ల కన్నా ఎక్కువగా ప్రజలను దోచుకుంటున్నారు” అని విమర్శించారు.

“మహిళా ద్రోహి చంద్రబాబు”

చంద్రబాబు మహిళల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“మహిళా పుట్టుకనే అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. దీని వల్ల మహిళల మానప్రాణాలకు హాని కలుగుతోంది. 16 నెలల్లో అనేక లైంగిక దాడులు, హత్యలు జరిగాయి” అని రోజా ఆరోపించారు.

“కమీషన్లు, దందాలు బయటకు రావాలి”

రోజా ఇంకా మాట్లాడుతూ, “చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు 21% పెరిగాయి. తాగిన మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. ఈ కమీషన్లు, దందాలు బయటకు రావాలి” అని డిమాండ్ చేశారు.

వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటూ టీడీపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు.
“నకిలీ మద్యం కేసుకు మూలం సురేంద్ర నాయుడు అనే వ్యక్తి. ఆయన 2006లో హత్య చేసినవాడు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక అతనికి క్షమాభిక్ష ఇచ్చి బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి క్రిమినల్స్‌కి చంద్రబాబు ఆశ్రయం ఇస్తున్నారు” అని రోజా మండిపడ్డారు.

సీబీఐ విచారణకు డిమాండ్

చివరగా రోజా, “నకిలీ మద్యం కేసులో ఉన్న వాస్తవాలను, కమీషన్లను సీబీఐ సమగ్రంగా దర్యాప్తు చేసి బయటకు తీయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాం” అని అన్నారు.

బిహార్ రాజకీయాల్లో మజ్లిస్ హల్‌చల్ — 100 స్థానాల్లో పోటీకి సిద్ధం!

YSR Praja News : పాట్నా: “ఇంతింతై.. వటుడింతై.. బ్రహ్మాండాంతపు సంవర్థియై” అన్నట్లుగా 1969లో హైదరాబాద్ బల్దియా ఎన్నికల్లో పత్తరట్టీ డివిజన్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్ (ఎంఐఎం) ఇప్పుడు జాతీయ స్థాయిలో తన పావులు వేస్తోంది.

సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం, ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో కొత్త దిశగా సాగుతోంది.

 

 

 

బిహార్‌లో మజ్లిస్ వ్యూహం

 

2015 నుంచే బిహార్‌పై దృష్టి సారించిన మజ్లిస్, 2020 ఎన్నికల్లో సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్థానాలను కైవసం చేసుకుంది.

 

అమౌర్ — అక్తరుల్ ఇమాన్

 

బైసీ — రుక్ముద్దీన్ అహ్మద్

 

కొద్దమాన్ — ఇజ్ఞార్ ఆసిఫీ

 

బహదూర్ గంజ్ — అంజార్ నయీమీ

 

జోకిహాట్ — షానవాజ్ ఆలం

 

 

ఈ విజయాలతో అసెంబ్లీలో నాలుగో శక్తిగా అవతరించింది.

 

 

 

ఈసారి మరింత బలంగా

 

తాజాగా అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించినట్లు, బిహార్ అసెంబ్లీకి గాను మజ్లిస్ 243 సీట్లలో 100 స్థానాల్లో పోటీ చేయనుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అక్తరుల్ ఇమాన్ మాట్లాడుతూ —

 

> “ఆర్జేడీతో పొత్తు కోసం ప్రయత్నించాం. స్పందన రాలేదు. కాబట్టి ఒంటరిగా పోరాటానికి సిద్ధమయ్యాం. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలసి తృతీయ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉంది” అన్నారు.

 

 

 

ఈ ప్రకటనతో బిహార్ రాజకీయాల్లో హీట్ పెరిగింది.

 

 

 

ఓట్లు చీలుతాయా?

 

మజ్లిస్ పోటీతో ముస్లిం మైనారిటీల ఓట్లు చీలి ప్రధాన పార్టీలకు నష్టం కలిగే అవకాశముందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

2020లో కూడా ఇదే ఆరోపణలు ఎదుర్కొన్న మజ్లిస్, ఇప్పుడు వీటిని పట్టించుకోకుండా విస్తృత ప్రచార వ్యూహాలు రూపొందిస్తోంది.

2022లో పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరినప్పటికీ, ఇమాన్ మాత్రం మజ్లిస్ తరఫున కొనసాగుతున్నారు.

 

 

 

సీమాంచల్‌లో ఫోకస్

 

అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల నాలుగు రోజులపాటు బిహార్ పర్యటన చేసి,

కిషన్‌గంజ్, అరారియా, కతిహార్, పూర్నియా జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు.

బీజేపీ, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై విమర్శలతో విరుచుకుపడి,

 

> “ముస్లిం సమాజాన్ని ఈ పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.

 

 

 

 

 

ప్రతిపక్షాల విమర్శలు

 

ప్రధాన పార్టీలు ఇప్పటికే మజ్లిస్‌పై దాడి ప్రారంభించాయి.

 

బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్, ఆర్జేడీ ఆరోపణలు చేస్తున్నారు.

 

సెక్యూలర్ ఓట్లు విభజించి బీజేపీకి లాభం కలిగించడం మజ్లిస్ వ్యూహమని మండిపడుతున్నారు.

 

 

కానీ మజ్లిస్ మాత్రం ఈ విమర్శలను పక్కనపెట్టి,

“ఇంటింటి ప్రచా

రం” ప్రధాన ఆయుధంగా తీసుకుని బిహార్‌లో పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు ఆశ్రయం – బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం

YSR Praja News : హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీ విడుదల కాగా, దానిని అధ్యయనం చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ కౌన్సిల్స్‌తో చర్చించి, హైకోర్టు ఇచ్చిన స్టే ఆదేశాలను ఎత్తివేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించేందుకు అనుమతి కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. సోమవారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

 

ప్రభుత్వ వాదన ప్రకారం — ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో హైకోర్టు జోక్యం సరికాదని పేర్కొననుంది. అలాగే, జనాభా గణాంకాల సర్వే ఆధారంగా బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్లు సముచితమని, చట్టం ప్రకారం రిజర్వేషన్ల పరిమితిని సవరించిన విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.

 

ఇక మరోవైపు, రిజర్వేషన్ల జీవో నంబర్ 9ను సవాలు చేస్తూ బీ మాధవరెడ్డి, మరో వ్యక్తి సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు తీర్పుపై ఎవరైనా అప్పీలు దాఖలు చేస్తే తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థిం

చారు.

ఉల్లి రైతులపై కూటమి నిర్లక్ష్యం – వైఎస్ అవినాష్ రెడ్డి

YSR Praja News :

కడప: ఉల్లి ధర దారుణంగా పడిపోతున్నా, కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. ఉల్లి రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

కడపలో ఉల్లి రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ నేతలు జిల్లా కలెక్టర్ను కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఈ భేటీలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ –

> “ఉల్లి రైతుల దయనీయ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కలెక్టర్ను కలిశాం. మైదుకూరు, కమలాపురంలో ఉల్లి పంట కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చెబుతున్నా, అక్కడ కొనుగోలు జరగడం లేదు. రైతులు పంటను అమ్ముకోలేక నీటిలో పడేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరతో వెంటనే కొనుగోలు ప్రారంభించాలి,” అని పేర్కొన్నారు.

 

అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, “కర్నూల్ జిల్లాలో హెక్టారుకు రూ.50,000 మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. అదే విధంగా కడప జిల్లాలోనూ అమలు చేయాలి. కానీ కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది,” అని అన్నారు.

అదే సమయంలో ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

> “పులివెందులలో ఘర్షణలకు సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు పెడుతున్నారు. పార్టీ నాయకులను వేధించి మనోస్థైర్యం దెబ్బతీసేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుతున్నారు,” అని ఆరోపించారు.

 

అదే విధంగా పవన్ కల్యాణ్‌పై కూడా వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

> “హైదరాబాద్లో ఉంటూ ఏపీలో రోడ్ల పరిస్థితి గురించి ఆయనకు ఏమి తెలుసు? హైదరాబాద్లో రోడ్లు చూసి ఏపీలో కూడా అలాగే ఉంటాయనుకుంటున్నారు. ఇది ప్రజలతో ఆటలాడే విధానం,” అని ఎద్దేవా చేశారు.

 

ఆరోగ్యశ్రీ సమస్యలపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ –

> “ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడం వల్ల నెట్‌వర్క్ హాస్పిటల్స్ వైద్యం నిలిపేశాయి. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటోంది. కల్తీ మద్యంపై ఆరు నెలల క్రితమే టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పారు. కానీ ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు,” అని అన్నారు.

 

ఉల్లి ధర పతనంపై వివరాలు చెబుతూ అవినాష్ రెడ్డి తెలిపారు –

> “ప్రభుత్వం రూ.1,200 మద్దతు ధర ప్రకటించినా, ప్రస్తుతం మార్కెట్‌లో రూ.500కే అమ్మకాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో రూ.5 వేల ధరకు ఉల్లి అమ్మే పరిస్థితి మేము తీసుకొచ్చాం. వెంటనే రైతులకు మద్దతు ధర అందేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.

 

జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ –

> “దుర్మార్గమైన ప్రభుత్వం ఏపీలో నడుస్తోంది. రైతుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు అందుబాటులో లేరు. పంట నష్టం, ఇన్సూరెన్స్ ఏదీ లేదు. మద్దతు ధర చెప్పడం తప్ప అమలులో లేదు. ఇంకో రెండు నెలల పాటు ఉల్లి దిగుబడి ఉంటుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో 21 రోజుల్లో నష్టపరిహారం ఇచ్చాం. కానీ ఇప్పుడు నిర్లక్ష్యం మాత్రమే కనిపిస్తోంది,” అని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో హైడ్రా సర్జ్‌ – బంజారాహిల్స్‌లో ₹750 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ తొలగింపు

YSR Praja News Telugu : హైదరాబాద్: నగరంలో హైడ్రా (HYDRA) అధికారుల కూల్చివేత చర్యలు వేగం పుంజుకున్నాయి. బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలో శుక్రవారం ఉదయం నుండి భారీ స్థాయిలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. సుమారు 750 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలు గుర్తించడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు.

 

వివరాల ప్రకారం, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలోని ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు జరిగాయని అధికారులు గుర్తించారు. అనంతరం, ఆ భూమిని పరిశీలించి కూల్చివేత చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో శుక్రవారం ఉదయం హైడ్రా సిబ్బంది భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు.

 

అధికారుల సమాచారం ప్రకారం, వీఆర్ ఇన్ఫ్రా పార్థసారథి మరియు ఆయన కుమారుడు విజయ్ భార్గవా ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు తేలింది. షేక్‌పేట్ మండలం, బంజారాహిల్స్ రోడ్ నంబర్-10లో ఈ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో ఈ ఐదు ఎకరాల్లో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించినప్పటికీ, పార్థసారథి మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ కోర్టులో కేసు వేసి, చుట్టూ ఫెన్సింగ్ వేసి, బౌన్సర్లు మరియు వేటకుక్కలతో భూమిని కాపలా పెట్టించాడు.

 

తాజా విచారణలో, సర్వే నంబర్ 403లో ఉన్న ప్రభుత్వ భూమిని 403/52 బై నంబర్‌గా మార్చి ఆక్రమణకు పాల్పడ్డారని హైడ్రా నిర్ధారించింది. రిజిస్ట్రేషన్ లేని సేల్ డీడ్ ఆధారంగా భూమిపై హక్కు కలిగినట్టు పార్థసారథి క్లెయిమ్ చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు.

 

ఇక, హైడ్రా అధికారులు ప్రస్తుతం ఆ భూమిని ప్రభుత్వ స్వామ్యంగా స్వాధీనం చేసుకుని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, “ప్రభుత్వ భూమి – హైడ్రా ఆధీనంలో” అనే బోర్డులు ఏర్పాటు చేశారు.

 

🔹 ప్రధాన అంశాలు:

 

బంజారాహిల్స్‌లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ.

 

రూ. 750 కోట్ల విలువైన స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత.

 

వీఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, కుమారుడు విజయ్ భార్గవా పై ఆరోపణలు.

 

  • హైడ్రా ఆధీనంలో భూమి తిరిగి స్వాధీనం.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే: ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక భేటీ

YSR Praja News Telugu : హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడం, తదనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు గురువారం రాత్రి ఎర్రవల్లి నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు.

 

ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు, మాజీ మంత్రి టి. హరీశ్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తాజా పరిణామాలపై కేసీఆర్ నేతలతో చర్చించి, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిన తీరును ప్రజల్లో ఎండగట్టాలని ఆదేశించారు.

 

కేసీఆర్ వ్యాఖ్యానించినట్లుగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకపోవడం, అసెంబ్లీ లోపల, బయట బీఆర్ఎస్ మద్దతు ఉన్నప్పటికీ జీవోకు చట్టబద్దత సాధించడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

 

ఇక, బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బహిర్గతం చేసేలా ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సన్నద్ధతపైనా కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఐదుగురు మాజీ మంత్రుల నేతృత్వంలో ఏర్పడిన వార్ రూమ్‌ పనిచేయాల్సిన తీరుపై ఆయన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యూహం, బలాబలాలపై విశ్లేషణ జరిపి తగు సూచనలు చేశారు.

 

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డ నేపధ్యంలో, గ్రామీణ ప్రాంత నేతలు, కేడర్‌ను జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ ఆదేశించారు.

ఉపఎన్నిక ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వడానికి కేటీఆర్, హరీశ్రావు రాబోయే ఒకట్రెండు రోజుల్లో పార్టీ డివిజన్ ఇన్‌చార్జీలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నార

ని సమాచారం.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈ రోజు నోటిఫికేషన్ జారీ చేసింది. మొదటి విడతలో మొత్తం 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్‌ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.

జడ్పీటీసీ నామినేషన్లు సంబంధిత జిల్లా పరిషత్ కార్యాలయంలో,

ఎంపీటీసీ నామినేషన్లు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాలి.

💰 డిపాజిట్ వివరాలు:

జడ్పీటీసీ జనరల్ అభ్యర్థి – రూ. 5,000

జడ్పీటీసీ రిజర్వ్ అభ్యర్థి – రూ. 2,500

ఎంపీటీసీ జనరల్ అభ్యర్థి – రూ. 2,500

ఎంపీటీసీ రిజర్వ్ అభ్యర్థి – రూ. 1,250

📅 తేదీలు & నిబంధనలు:

నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 11 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే.

నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి అనుమతి లేదు.

నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12న జరుగుతుంది.

అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

📜 అభ్యర్థులు పూర్తి డాక్యుమెంట్లు, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్లు సమర్పించాలని సూచించారు. ఎన్నికల నియమావళి పాటించని నామినేషన్లు తిరస్కరించబడతాయని హెచ్చరించారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన మేరకు, ప్రచార నిబంధనలు మరియు ఆచరణ నియమావళి త్వరలో విడుదల కానున్నాయి.

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల (లోకల్ బాడీ) ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ, హైకోర్టు ప్రభుత్వానికి కఠిన సూచనలు ఇచ్చింది. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9 అమలుపై కూడా కోర్టు తాత్కాలిక నిలుపుదల విధించింది.

 

హైకోర్టు పిటిషనర్లను రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని, ప్రభుత్వాన్ని నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలపాటు వాయిదా వేసింది.

 

హైకోర్టు ఉత్తర్వులతో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌పై పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. కోర్టు ఆర్డర్‌ను పరిశీలించిన తరువాత మాత్రమే కొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

 

ఏజీ వాదనలు

 

విచారణలో భాగంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.

“బీసీ జనాభా 57.6 శాతం ఉందని సర్వేలో తేలింది. బిల్లుపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. గవర్నర్ ఆమోదం లేకపోయినా చట్టం అమల్లోకి వచ్చినట్లే. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇదే చెబుతుంది.

విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు వేరు — లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్యా రిజర్వేషన్లకు సంబంధించినది మాత్రమే. మేము రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో జారీ చేశాం” అని ఆయన వివరించారు.

 

ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది వాదనలు

 

ప్రభుత్వం తరఫున న్యాయవాది రవివర్మ మాట్లాడుతూ —

“రాజ్యాంగంలో 50 శాతం రిజర్వేషన్ పరిమితి ఎక్కడా పేర్కొనలేదు. తెలంగాణలో రిజర్వేషన్ లేని జనాభా కేవలం 15 శాతం మాత్రమే. వారికే 33 శాతం సీట్లు ఇస్తున్నాం” అని తెలిపారు.

 

అయితే, ప్రభుత్వ వాదనలు పూర్తయ్యాక హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల

పై స్టే విధించింది.

నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నట్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (అక్టోబర్ 9) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ యత్నాలను ఎండగట్టారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని “పేదలపై ద్రోహం”గా అభివర్ణించారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ – > “మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకువచ్చాం. పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించడమే మా లక్ష్యం. కోవిడ్ సమయంలో కూడా నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేది.” అలాగే ఆయన తెలిపారు – > “విజయనగరం, పాడేరు వంటి కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తయ్యాయి, ఐదింట్లో 2023–24లో క్లాసులు మొదలయ్యాయి. ఇవన్నీ పేద పిల్లలకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు. అలాంటి సంస్థలను చంద్రబాబు అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.” చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. > “అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి రోడ్లు, డ్రైనేజీలకు లక్షకోట్లు ఖర్చు చేయాలనుకుంటున్న చంద్రబాబు… పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా?” అని ప్రశ్నించారు. స్పీకర్‌పై కూడా వైఎస్ జగన్ ఘాటుగా విరుచుకుపడ్డారు. > “జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెబుతున్న స్పీకర్ తన పదవికి అర్హుడా?” అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేశారని జగన్ ఆరోపించారు. — ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ “కోటి సంతకాల ఉద్యమం” ప్రారంభిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. 📅 అక్టోబర్ 10 – నవంబర్ 22: రచ్చబండలు, సంతకాల సేకరణ 📅 అక్టోబర్ 28: నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు 📅 నవంబర్ 12: జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు 📅 నవంబర్ 23: సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలింపు 📅 నవంబర్ 24: గవర్నర్‌కి సంతకాల పత్రాల సమర్పణ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు – > “పేదల వైద్య హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.”

YSR Praja News Telugu : నర్సీపట్నం: ప్రజారోగ్యం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుతున్నట్లుగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఈరోజు (అక్టోబర్ 9) నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ యత్నాలను ఎండగట్టారు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని “పేదలపై ద్రోహం”గా అభివర్ణించారు.

 

వైఎస్ జగన్ మాట్లాడుతూ –

 

> “మా హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీని తీసుకువచ్చాం. పేదలకు అందుబాటులో ఉచిత వైద్యం అందించడమే మా లక్ష్యం. కోవిడ్ సమయంలో కూడా నర్సీపట్నం కాలేజీ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేశాం. పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేది.”

 

 

 

అలాగే ఆయన తెలిపారు –

 

> “విజయనగరం, పాడేరు వంటి కాలేజీల్లో ఇప్పటికే క్లాసులు ప్రారంభమయ్యాయి. 17 మెడికల్ కాలేజీల్లో 7 పూర్తయ్యాయి, ఐదింట్లో 2023–24లో క్లాసులు మొదలయ్యాయి. ఇవన్నీ పేద పిల్లలకు వైద్య విద్య, పేదలకు వైద్యం అందించే ఆధునిక దేవాలయాలు. అలాంటి సంస్థలను చంద్రబాబు అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటు.”

 

 

 

చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

 

> “అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి రోడ్లు, డ్రైనేజీలకు లక్షకోట్లు ఖర్చు చేయాలనుకుంటున్న చంద్రబాబు… పేదలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదు వేల కోట్లు ఖర్చు చేయలేరా?” అని ప్రశ్నించారు.

 

 

 

స్పీకర్‌పై కూడా వైఎస్ జగన్ ఘాటుగా విరుచుకుపడ్డారు.

 

> “జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెబుతున్న స్పీకర్ తన పదవికి అర్హుడా?” అంటూ ప్రశ్నించారు.

 

 

 

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను ఆపేశారని జగన్ ఆరోపించారు.

 

 

 

ప్రజా ఉద్యమానికి వైఎస్ జగన్ పిలుపు

 

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ “కోటి సంతకాల ఉద్యమం” ప్రారంభిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.

 

📅 అక్టోబర్ 10 – నవంబర్ 22: రచ్చబండలు, సంతకాల సేకరణ

📅 అక్టోబర్ 28: నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

📅 నవంబర్ 12: జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు

📅 నవంబర్ 23: సంతకాల పత్రాలను జిల్లా కేంద్రాలకు తరలింపు

📅 నవంబర్ 24: గవర్నర్‌కి సంతకాల పత్రాల సమర్పణ

 

వైఎస్ జగన్ పిలుపునిచ్చారు –

 

> “పేదల వైద్య హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి.”

సుప్రీంకోర్టులో షూ ఘటనపై సంచలనం – లాయర్ రాకేష్ కిషోర్‌పై బార్ అసోషియేషన్ బహిష్కరణ

YSR Praja News : న్యాయవ్యవస్థను కుదిపేసిన సుప్రీంకోర్టు షూ ఘటనపై కొత్త మలుపు తిరిగింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై షూ విసిరిన లాయర్ రాకేష్ కిషోర్(71)ను సుప్రీం కోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరించింది. భవిష్యత్తులో కోర్టు ప్రాంగణంలోకి ఆయన ప్రవేశించకుండా ఎంట్రీ కార్డు రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.

 

అక్టోబర్ 6న సుప్రీంకోర్టు నెంబర్ 1 హాల్లో కేసుల మెన్షనింగ్ జరుగుతున్న సమయంలో రాకేష్ కిషోర్ షూ విసరడంతో కలకలం చెలరేగింది. షూ బెంచ్ దాకా చేరకుండానే కింద పడిపోవడంతో లాయర్లు అతన్ని అడ్డుకున్నారు. దాడికి జస్టిస్ గవాయ్ కూల్‌గా స్పందిస్తూ — “ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయలేవు” అంటూ కోర్టు కార్యకలాపాలను కొనసాగించారు.

 

దాడి సమయంలో “సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం” అని రాకేష్ కిషోర్ నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే సీజేఐ సూచనతో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ అతనిపై పోలీసు ఫిర్యాదు చేయలేదు. ఢిల్లీ పోలీసులు విచారణ అనంతరం అతన్ని షూ, పత్రాలతో సహా విడుదల చేశారు.

 

తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లోనూ ప్రాక్టీస్ చేయకుండా తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే, సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

 

దాడి చర్యను సమర్థిస్తూ రాకేష్ కిషోర్ “ఇది దైవ నిర్ణయం” అని మీడియాకు వెల్లడించారు. తనపై వివరణ లేకుండా సస్పెండ్ చేయడాన్ని తప్పుబడుతూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

 

ఇక తాజాగా బెంగళూరులో అతనిపై కొత్త కేసు నమోదైంది. సీజేఐపై ఉద్దేశపూర్వక దాడి చేశారంటూ ఆల్ ఇండియా అడ్వొకేట్స్ అసోషియేషన్ అధ్యక్షుడు భక్తవత్సల విధానసౌధ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌గా నమోదు చేసిన కేసు ఢిల్లీకి బదిలీ

కానుంది.