ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు రేపటినుంచి – అన్ని ఏర్పాట్లు పూర్తి

YSR Praja News Telugu: హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

26/11 తర్వాత పాకిస్తాన్‌పై యుద్ధం చేయలేకపోయింది కాంగ్రెస్: ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు”

YSR Praja News : ముంబై: 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గామని…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

కోనసీమ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

YSR Praja News : తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

టీజీఎస్ ఆర్టీసీ నియామకాలు: అక్టోబర్ 8 నుంచి డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

YSR Praja News: హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 8)…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహంపై బీఆర్ఎస్ కీలక నేతల మంత్రణ

YSR Praja News : హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌ కీలక నేతలు మంగళవారం సమావేశమయ్యారు. నందినగర్‌లో పార్టీ వర్కింగ్…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

తాండూర్‌లో జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల నిరసన

YSR Praja News Telugu : తాండూర్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, తాండూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్

YSR Praja News Telugu : హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

“రాష్ట్రంలో రాక్షస పరిపాలన నడుస్తోంది – వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు”

YSR Praja News Telugu : తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైనల్ నిర్ణయం – నవీన్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఇవాళ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో…

ఆంద్రప్రదేశ్ / Andra Pradesh

ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వం: పేర్ని నాని తీవ్ర విమర్శలు

YSR Praja News : అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటనలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ…

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు రేపటినుంచి – అన్ని ఏర్పాట్లు పూర్తి

YSR Praja News Telugu: హైదరాబాద్‌: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ రేపటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి తొలివిడత నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో, ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి అడ్డంకి లేకుండా మారింది.

 

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణీకుముదిని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికలు స్వేచ్ఛాయుత, శాంతియుత వాతావరణంలో జరుగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే జిల్లాల వారీగా అధికారులు నోటిఫికేషన్‌ల విడుదలకు ఏర్పాట్లు పూర్తిచేశారు.

 

మొత్తం 31 జిల్లాల్లో (హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి మినహా) ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 292 మండలాల్లో 292 జెడ్పీటీసీ, 2,963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు నోటిఫికేషన్‌ జారీ అయిన రోజు నుంచి మూడు రోజులలోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

 

5 దశల్లో స్థానిక ఎన్నికలు

స్థానిక సంస్థల ఎన్నికలు ఐదు దశల్లో నిర్వహించనున్నారు.

 

మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు: అక్టోబర్‌ 23

 

రెండో విడత: అక్టోబర్‌ 30

 

గ్రామపంచాయతీ ఎన్నికలు: అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, నవంబర్‌ 8

 

 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల లెక్కింపు నవంబర్‌ 11న జరగనుంది. హైకోర్టు స్టే కారణంగా ములుగు జిల్లా మంగపేట మండలంలోని 14 ఎంపీటీసీ, 25 గ్రామపంచాయతీ స్థానాలు, అలాగే కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని కొన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరగవు.

 

సమగ్ర ఏర్పాట్లు పూర్తయ్యాయి

మొదటి విడత ఎన్నికలకు జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశారు. మండల కార్యాలయాల్లో ఎంపీటీసీ, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో జెడ్పీటీసీ నామినేషన్లు స్వీకరించనున్నారు. భద్రతా చర్యలు, కోడ్ అమలు పర్యవేక్షణకు సంబంధించి అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సూచనలు ఇచ్చారు.

26/11 తర్వాత పాకిస్తాన్‌పై యుద్ధం చేయలేకపోయింది కాంగ్రెస్: ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు”

YSR Praja News : ముంబై: 2008 ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై యుద్ధానికి దిగాలనే ఆలోచన ఉన్నప్పటికీ, అమెరికా ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గామని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటైన విమర్శలు చేశారు.

 

నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మోదీ, కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “2008లో దేశ వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది? టెర్రరిజం ముందు మోకరిల్లింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేత స్వయంగా ఒప్పుకున్నారు” అంటూ విమర్శించారు.

 

ప్రధాని మోదీ మాట్లాడుతూ, “26/11 దాడి దేశ చరిత్రలో అత్యంత జుగుప్సాకరమైన సంఘటన. ఆ దాడి వెనుక ఉన్న పాకిస్తాన్‌పై కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోలేదు. మరో దేశం యుద్ధం వద్దని చెప్పడంతో బలగాలను పంపలేదట. ఇది కదా విదేశీ ఒత్తిడికి లొంగడమంటే?” అని ప్రశ్నించారు.

 

ఇక, ఇటీవల కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారాయి. జూలై నెలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆయన “2008 దాడుల తర్వాత అమెరికా ఒత్తిడి కారణంగా పాకిస్తాన్‌పై యుద్ధం వద్దనుకున్నాం” అని చెప్పడం బీజేపీ తరచుగా ప్రస్తావిస్తోంది.

 

ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరోసారి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేలా మారాయి. పార్టీ బలహీనత దేశ భద్రతకు ముప్పని ఆయన హితబోధ

చేశారు.

కోనసీమ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

YSR Praja News : తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు. రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

 

టీజీఎస్ ఆర్టీసీ నియామకాలు: అక్టోబర్ 8 నుంచి డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

YSR Praja News: హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల నియామకానికి దరఖాస్తు ప్రక్రియ బుధవారం (అక్టోబర్ 8) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 28 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.

 

దరఖాస్తు సమయంలో ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులు తమ కమ్యూనిటీ సర్టిఫికెట్లను కొత్త నిర్దేశిత ఫార్మాట్‌లో (గ్రూప్-I / గ్రూప్-II / గ్రూప్-III ఉపవర్గీకరణతో) అప్లోడ్ చేయాలని సూచించారు. కొత్త సర్టిఫికెట్ లేని వారు ప్రస్తుత కమ్యూనిటీ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయవచ్చని చెప్పారు. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో కొత్త ప్రొఫార్మాలో సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాలని, లేదంటే ఎస్సీ కేటగిరీ కింద పరిగణించరని స్పష్టం చేశారు.

 

ఇక, సెప్టెంబర్ 17న టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం టీజీఎస్ ఆర్టీసీలో మొత్తం 1,743 పోస్టులు భర్తీ చేయనున్నాయి. వీటిలో డ్రైవర్ పోస్టులు 1,000 కాగా, శ్రామిక్ పోస్టులు 743 ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు పేస్కేల్ రూ.20,960–60,080 మధ్య ఉండగా, శ్రామిక్ పోస్టులకు రూ.16,550–45,030గా నిర్ణయించారు.

 

అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్‌సైట్‌లో (www.tslprb.in) సందర్శించాలని చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వ్యూహంపై బీఆర్ఎస్ కీలక నేతల మంత్రణ

YSR Praja News : హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌ కీలక నేతలు మంగళవారం సమావేశమయ్యారు. నందినగర్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 

ఈ భేటీలో ఉప ఎన్నికల ప్రచార వ్యూహంపై ప్రాథమిక చర్చలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై బుధవారం హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికలు జరిగే పక్షంలో హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలకు బూత్‌వారీగా ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

 

కోర్టు ప్రతికూలంగా స్పందించినట్లయితే, ఇతర జిల్లాల నేతలకు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగానే ఇతర జిల్లాల నాయకులను కూడా ప్రచారంలో మోహరించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 

నేడు మరో కీలక భేటీ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచార వ్యూహానికి తుది రూపు ఇవ్వడానికి బుధవారం మరో భేటీ జరగనుంది. కేటీఆర్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, దాసోజు శ్రవణ్‌, పోచంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొంటారు.

 

పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసిన నేపథ్యంలో రోడ్‌షోలు, హాల్‌ మీటింగ్స్‌ షెడ్యూల్‌పై చర్చించనున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొనే ప్రచార కార్యక్రమాలకు తుది షెడ్యూల్‌ ఖరారవుతుందని సమాచారం.

 

ఆర్టీసీ ప్రైవేటీకరణపై కేటీఆర్‌ విమర్శలు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. “ఇన్నోవేటివ్‌ థింకింగ్‌” పేరిట భార్యలకు ఉచిత ప్రయాణం ఇస్తూ భర్తల నుంచి డబుల్‌ చార్జీలు వసూలు చేయడం, పిల్లల బస్‌ పాస్‌ రేట్లు పెంచడం వంటి చర్యలతో ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని ఆయన మండిపడ్డారు.

 

మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి జరిగే నష్టాన్ని చార్జీల పెంపుతో భర్తీ చేసుకుంటోందని, ఒక్కో కుటుంబంపై సుమారు 20% అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.

 

హైదరాబాద్లో కాంగ్రెస్‌ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదని, అందుకే ప్రజలపై కక్ష తీర్చుకునేందుకు ఈ నిర్ణయాలు తీసుకుంటోందని కేటీఆర్‌ ఆరోపించారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఈ చార్జీల పెంపుకు కాంగ్రెస్‌ ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

తాండూర్‌లో జస్టిస్ బి.ఆర్. గవాయి‌పై దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల నిరసన

YSR Praja News Telugu : తాండూర్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, తాండూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తాండూర్ సెక్యులర్ వాదులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు.

 

సోమవారం జరిగిన ఘటనలో సుప్రీంకోర్టు న్యాయవాది ఒకరు “సనాతన ధర్మాన్ని అవమానపరిచారు” అంటూ జస్టిస్ గవాయి పై చెప్పు విసరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడిని నిరసిస్తూ మంగళవారం సాయంత్రం తాండూర్‌లో సెక్యులర్ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

 

ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్, టీజేఎస్ నాయకులు సాంబూర్ సోమశేఖర్, కే.ఎన్.పి.ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రయ్య, ప్రముఖ న్యాయవాది కే. గోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పిడిఎస్సి అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

నాయకులు మాట్లాడుతూ — “న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను సమీక్షించడమో, విమర్శించడమో ప్రతి పౌరుడి హక్కు. కానీ న్యాయమూర్తులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లే. ఇది టెర్రరిస్టు ఆలోచనల ప్రతీక” అని మండిపడ్డారు.

 

అలాగే, “న్యాయవ్యవస్థను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇలాంటి దాడులు దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి దారితీస్తాయి. సనాతన ధర్మం పేరుతో హింసకు దిగేవారు బలహీనులు. ఇలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించి కఠినంగా శిక్షించాలి” అని వారు పేర్కొన్నారు.

 

భారత రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలుపుకోవాలంటే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.

 

ఈ కార్యక్రమంలో అంజాద్ అలీ పాషా, యాసర్, టి హెచ్ ఎం ఎస్ పి ఎస్ తాండూర్ అధ్యక్షుడు సమి, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్, డాక్టర్ మగ్దూం, అరుణ్ ఫయాజ్, అరుణ్ నాయక్, శ్రీకాంత్, నవీన్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

 

తాండూర్‌లో వెలుగుల నిరసన — న్యాయవ్యవస్థకు మద్దతు, ప్రజాస్వామ్యానికి రక్షణ!

పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్

YSR Praja News Telugu : హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

 

ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీట్లో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, “బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను ఉద్దేశించి ‘దున్నపోతు’ అనే పదం వాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం” అన్నారు.

 

ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు, బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని పేర్కొన్నారు. జరిగిన తప్పును సరిదిద్దుకునే విధంగా వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన కూడా తప్పు జరిగిందని అంగీకరించారని తెలిపారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

 

అదేవిధంగా, మైనారిటీ వర్గాలకు చెందిన శాఖలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఎందుకు మౌనం వహించారని కూడా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

 

దళితుల పట్ల వివేక్ వెంకట్ స్వామి నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని, నిజంగా ఆయనలో దళిత స్ఫూర్తి ఉంటే వెంటనే పొన్నం వ్యాఖ్యలను ఖండించాల్సిందని అన్నారు. కాక జయంతి వేడుకలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను ఆహ్వానించకపోవడంపై కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి స్వాగతిస్తుందని, ఎంఆర్పీఎస్ మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యత అవసరమని, అగ్రకుల పేదలకు ఇచ్చినట్లే బీసీల రిజర్వేషన్లను అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు.

 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించిన మందకృష్ణ మాదిగ, “గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాయి. ఆయన స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగేది కాదు” అని పేర్కొన్నారు.

“రాష్ట్రంలో రాక్షస పరిపాలన నడుస్తోంది – వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు”

YSR Praja News Telugu : తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులతో ఆయన ఇవాళ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ—

> “కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తోంది. ఈ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భ్రమలు పూర్తిగా తొలగిపోయాయి. వ్యవస్థలన్నీ నిర్వీర్యం, అవినీతి పరాకాష్టకు చేరాయి. సీఎం చంద్రబాబుకు పాలనపై ధ్యాస లేకుండా సొంత ఆదాయాల పెంపుపై మాత్రమే దృష్టి పెట్టారు” అని విమర్శించారు.

అవినీతి, కల్తీ మద్యం, విద్య, ఆరోగ్య రంగాల్లో అన్యాయాలు, ప్రైవేటీకరణపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు.

> “మన హయాంలో లిక్కర్ పాలసీ పారదర్శకంగా ఉండేది. ప్రతి బాటిల్‌పై క్యూ ఆర్ కోడ్, ప్రతి అమ్మకంపై క్వాలిటీ చెక్ తప్పనిసరి. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కల్తీ లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజల ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం లాభాలకే పరిమితమైంది” అన్నారు.

చంద్రబాబు పాలనలో రాక్షస పరిపాలన నడుస్తోందని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్ జగన్ దుయ్యబట్టారు. విద్యారంగం దెబ్బతిందని, ప్రభుత్వ స్కూళ్లలో ఐదు లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారని చెప్పారు.

> “మన హయాంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్న చోట, కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. కానీ ఇప్పుడు వాటిని ప్రైవేటీకరణ దిశగా నెడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న వైద్యం కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, బస్సులు, స్కూళ్లు ఎందుకు నడపాలి అనే మూల్యాలు ఈ ప్రభుత్వం మరిచిపోయింది” అని జగన్ అన్నారు.

అమరావతి భూసేకరణపై కూడా వైఎస్ జగన్ స్పందిస్తూ—

> “ఇప్పటికే 50 వేల ఎకరాలు ఉన్నా మరో 50 వేల ఎకరాలు సేకరిస్తున్నారు. మొదటి దశ మౌలిక సదుపాయాలకే లక్ష కోట్లు ఖర్చవుతాయని చెబుతూ, ఇప్పుడు రెండింతలుగా పెంచారు. ప్రజల సొమ్ముతో మాఫియా ప్రాజెక్టులు నడిపిస్తున్నారు” అని విమర్శించారు.

జగన్ ప్రకటించిన “రచ్చబండ” కార్యక్రమం వివరాలు:

అక్టోబర్ 9: నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శన

అక్టోబర్ 10 – నవంబర్ 22: రాష్ట్రవ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కరపత్రాల పంపిణీ

కోటి సంతకాల సేకరణ — ప్రతి పంచాయతీ నుంచి కనీసం 500 సంతకాలు

నియోజకవర్గ స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు

అక్టోబర్ 28: నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు

నవంబర్ 12: జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు

నవంబర్ 24: సంతకాల వాహనాలు విజయవాడకు — గవర్నర్‌కు సంతకాల పత్రాల సమర్పణ

> “ప్రజల్లో చైతన్యం పెంచి, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం కొనసాగించాలి” అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఫైనల్ నిర్ణయం – నవీన్ యాదవ్‌కు గ్రీన్ సిగ్నల్

YSR Praja News : హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఇవాళ నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నవీన్‌ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రేసులో ఉన్న బొంతు రామ్మోహన్‌ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.

 

బొంతు రామ్మోహన్‌ మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌ అభ్యర్థిని హైకమాండ్‌ నిర్ణయిస్తుంది. పార్టీ గెలుపుకోసం నేను పూర్తిగా కట్టుబడి పని చేస్తాను,” అని తెలిపారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.

 

హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే విమర్శల మధ్య, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి కూడా అదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

ఇక మంత్రులు గడ్డం వివేక్‌, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ తో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్‌ చైర్మన్లు, సీనియర్‌ నేతలు క్షేత్ర స్థాయిలో చురుకుగా పనిచేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్న పార్టీ, నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌ పేర్లను పరిశీలించింది. చివరకు సీఎం రేవంత్‌ నవీన్‌ వైపే ఆసక్తి చూపడంతో ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది.

 

📍 Tags: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రేవంత్ రెడ్డి, తెలంగాణ రాజకీయాలు

ప్రజల ఆరోగ్యాలతో ఆటలు ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వం: పేర్ని నాని తీవ్ర విమర్శలు

YSR Praja News : అమరావతి: రాష్ట్రంలో కల్తీ మద్యం ఘటనలపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వ కాలంలోనే కల్తీ మద్యం ఏరులై పారుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుతున్న ప్రభుత్వానికి బాధ్యత అనే భావన లేదని విమర్శించారు.

 

“ఎన్నికల ముందు మందుబాబులకు నాణ్యమైన మద్యం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యాప్తికి కారణమయ్యాడు. మందుబాబులకు వెన్నుపోటు పొడిచినట్టే ఇది” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందన్న విషయం ప్రభుత్వానికి పట్టదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.