YSR Praja News Telugu : అమరావతి / జంగారెడ్డిగూడెం:
పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వర్జీనియా పొగాకు మరియు సిగరెట్లపై విధించిన అధిక ఎక్సైజ్ డ్యూటీతో పాటు జీఎస్టీ పెంపు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. పన్నుల భారం పెరగడంతో పొగాకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందని, దాంతో ధరలు పడిపోవడం, కొనుగోళ్లు తగ్గడం వంటి పరిణామాలు తమ జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో పొగాకు రైతులు నిరసనలు చేపట్టి, పన్నులు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని వారు తెలిపారు. ఈ సమస్యపై రాజకీయంగా చొరవ చూపి, తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌కు రైతులు వినతిపత్రం సమర్పించారు.
రైతుల ఆవేదనను శ్రద్ధగా విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తి చర్చిస్తారని, రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు.
వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, ఎన్ఎల్ఎస్ వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు సత్రం వెంకటరావు, ఉపాధ్యక్షుడు అట్లూరి సతీష్, కార్యదర్శి సత్యనారాయణ, రైతు నాయకులు సత్తెనపల్లి వీర్రాజు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గుర్నాథరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ భేటీతో పొగాకు రైతుల్లో కొంత ఆశాభావం నెలకొంది. కేంద్ర స్థాయిలో అనుకూల నిర్ణయాలు వస్తే తమ పరిస్థితి మెరుగుపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.
“ఏపీలో పాలు, నీళ్లు తాగితే ప్రాణాలు పోవాల్సిన దుస్థితి నెలకొందని, రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు…”…
సిట్ చార్జ్షీట్లో ఉన్న అంశాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తూ గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శి తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇవి పార్టీ…