YSR Praja News: కుత్బుల్లాపూర్/హైదరాబాద్: తెలంగాణలో హిల్ట్ పాలసీ అమలుతో భారీ భూ కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, షాపూర్‌నగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రాథోడ్‌లతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
పారిశ్రామిక భూములు… ఎలా ప్రైవేట్ చేతుల్లోకి?
భూతపూర్వ ప్రభుత్వాలు పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు పెరగాలనే ఉద్దేశంతో ఇచ్చిన భూములను ఇప్పుడు విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్సుల కోసం కేటాయిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
“మార్కెట్ విలువ గజానికి లక్షన్నర ఉండగా, కేవలం రూ.4 వేలకే అప్పగించడం ప్రజల ఆస్తిని దోచుకోవడమే” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో పేదల ఇళ్లు, పాఠశాలలు, ఆసుపత్రులకు స్థలం లేదని… కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాలు అన్యాయంగా కేటాయించడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
> “ఈ భూములను వెనక్కి తీసుకొని… పేదల కోసం ఇళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు నిర్మించాలి” – కేటీఆర్
హిల్ట్ పాలసీ వెనక దాగి ఉన్న భూకుంభకోణం?
పారిశ్రామిక వాడల్లో భారీ దోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ
హిల్ట్ పాలసీని రద్దు చేయకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక
భవిష్యత్తులో తమ ప్రభుత్వం రాగానే చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం
కేటీఆర్ మాట్లాడుతూ… ఒకవైపు ప్రభుత్వమే ‘ఏకరానికి రూ.170 కోట్ల విలువ’ ఉన్న భూములను చెబుతుంటే… అదే ప్రాంతంలో రూ.1 కోటి మాత్రమే విలువ చూపించడం ఏంటని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు
ఫార్మా సిటీ భూములను ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పారిశ్రామికవేత్తలు, కార్మికులతో భేటీ అయిన ఆయన, సమస్యలను విని పరి
ష్కార చర్యలపై చర్చించారు.





