తాడేపల్లి: జగన్ ప్రశ్నలకు కూటమి నేతల్లో అసహనం

YSR Praja News Telugu : తాడేపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలతో కూటమి నాయకులు ఇబ్బంది పడుతున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గురువారం జరిగిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వం చేసిన హామీలు అమలుకు దూరంగా ఉన్నాయంటూ అనేక కీలక అంశాలను లేవనెత్తారు.

 

ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రచారం చేస్తూనే.. వాస్తవానికి ప్రజలకు ఏం అందించిందన్న సందేహాన్ని జగన్ వ్యక్తం చేశారు.

 

జగన్ ప్రశ్నలు ఇవీ:

 

నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతి ఎక్కడ?

 

ఆడబిడ్డ నిధి కింద మహిళలకు వాగ్దానం చేసిన ₹1,500 ఎందుకు ఇవ్వలేదు?

 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేశారా?

 

 

ఇవి కాకుండా తిరుమల లడ్డూ వివాదాన్ని కూడా జగన్ ప్రస్తావించారు.

2024 జూలైలో నాణ్యత సమస్యలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను ఆగస్టులో ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నించారు. కల్తీ నెయ్యి నిజమే అయితే టీటీడీ ఉన్నతాధికారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

 

జగన్ లేవనెత్తిన ఈ ప్రశ్నలపై కూటమి నేతలు ఇప్పటికీ స్పష్టతనివ్వకపోవడం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *