
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ విస్తృతంగా దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై తీవ్రంగా చర్చించనున్నారని సమాచారం. అలాగే సాగునీటి హక్కులు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై పార్టీ తీసుకోవాల్సిన పోరాట మార్గాలు, ప్రజా ఉద్యమాల రూపకల్పనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదేవిధంగా పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లోకి వెళ్లే అంశాలపై కూడా కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం పార్టీకి కీలక మలుపుగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.




