
YSR Praja News Telugu : తాండూరు:పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొరశెట్టి సత్యమూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మర్యాదా పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. తాండూరు నియోజకవర్గ ప్రజలు సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ధర్మానికి, సత్యానికి, ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వానికి ప్రతీక అయిన శ్రీరాముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.
కష్టాల్లో సైతం ధర్మాన్ని వీడని రాముడు చూపిన మార్గంలో నడుస్తూ, సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని దొరశెట్టి సత్యమూర్తి పిలుపునిచ్చారు. శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. తాండూరు పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ దేవాలయాల్లో వైభవంగా జరుగుతున్న సీతారాముల కల్యాణోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.




