తెలంగాణలో లిఫ్ట్ ప్రమాదాలు: హైకోర్టు ప్రభుత్వానికి కఠిన ఆదేశాలు

YSR Praja News : హైదరాబాద్: రాష్ట్రంలో లిఫ్ట్‌ల భద్రతా ప్రమాణాలు సరిగా అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లిఫ్ట్, ఎలివేటర్‌లకు సంబంధించిన చట్టం రూపొందించడానికే ప్రభుత్వం పదేళ్లు తీసుకుంటే, దాన్ని అమలు చేయడానికి మరెంత కాలం పడుతుందో అని కోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలకు సంబంధించని అంశంలో ఇలాంటి నిర్లక్ష్యం అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్యానించింది.

 

ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను పరిశీలించి, కొత్త చట్టాలు, నిబంధనలు రూపొందించాలని పిటిషనర్ చేసిన డిమాండ్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ భవనాల్లో లిఫ్ట్‌ల నిర్వహణ పర్యవేక్షణపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది.

 

ఇటీవలి కాలంలో లిఫ్ట్‌లు సరిగా పనిచేయక ప్రమాదాలు చోటుచేసుకొని, ప్రాణనష్టాలు సంభవించిన ఘటనలు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ఓ వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ కొనసాగిస్తోంది. ఇలాంటి ప్రమాదాలు మరొకటి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పూర్తివివరాలు సమర్పించాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిం

దే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *