YSR Praja News Telugu : తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలనే ఆలోచన తమకు ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్… కొందరు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం రెండు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రజలకు మేలు చేసే పని కాదని అన్నారు.“మనమంతా ఒకే భాష మాట్లాడే వాళ్లం. ఎవరికి ఎవరూ శత్రువులు కాదు. తెలంగాణ ప్రజలకు నష్టం చేయాలనే ఉద్దేశం నాకు లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని మా ప్రజలకు అన్యాయం జరగకుండా చూసుకోవడం కూడా మా బాధ్యతే. కొత్త రిజర్వాయర్లు నిర్మించకుండా, ఉన్న ప్రాజెక్టులకు నీరు అందించే ఏర్పాట్లు చేయకపోతే చరిత్ర మమ్మల్ని క్షమించదు. అందుకే మేం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం” అని జగన్ తెలిపారు.భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు పాలకులే చేస్తున్నారని ఆరోపించిన ఆయన… వాస్తవాలను సరిగ్గా ప్రజల ముందు ఉంచితే అందరూ అర్థం చేసుకుంటారని అన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సోదరభావంతో కలసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.రాయలసీమకు అన్యాయం జరిగిందని విమర్శరాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి ఆ ప్రాంత ప్రజలకు చంద్రబాబు నాయుడు తీవ్ర అన్యాయం చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు.“రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును కావాలనే ఆపేశారు. ఇది సీమ ప్రజలకు వెన్నుపోటు లాంటిదే. ఇలాంటి చరిత్ర దేశంలో అరుదుగా కనిపిస్తుంది. స్వప్రయోజనం కోసం సొంత ప్రాంతానికే ద్రోహం చేయడం బాధాకరం” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమకు ‘చంద్రగ్రహణం’ పట్టిందని వ్యాఖ్యానించారు.భోగాపురం ఎయిర్‌పోర్టుపై క్రెడిట్ రాజకీయంభోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ పట్టించుకోలేదని, తమ ప్రభుత్వ కాలంలోనే పనులు వేగంగా జరిగాయని చెప్పారు.కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా ఎయిర్‌పోర్టు పనులు ఆగలేదని, 2023లోనే 2025లో మొదటి విమానం టేకాఫ్ అవుతుందని తాను ప్రకటించానని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు పనుల్లో పాత్ర లేకుండానే క్రెడిట్ దక్కించుకునే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.చంద్రబాబు రాజకీయ శైలి ‘కాంట్రిబ్యూషన్ లేకుండా క్రెడిట్’ తీసుకోవడమేనని వ్యాఖ్యానిస్తూ… ప్రజలు నిజాలు తెలుసుకోవాలని జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు / Andhra Pradesh latest Newsఆంద్రప్రదేశ్ / Andra Pradeshరాజకీయాలు / Politics
తెలంగాణ–ఏపీ ప్రజలు అన్నదమ్ములే: వైఎస్ జగన్