
YSR Praja News : హైదరాబాద్: తెలంగాణలో మద్యం అమ్మకాలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దసరా పండుగ సందర్భంగా మందుబాబులు భారీగా కొనుగోళ్లు చేశారు. ముఖ్యంగా సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లోనే రూ. 419 కోట్ల మద్యం సేల్స్ జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే… సెప్టెంబర్ 30న ఒక్కరోజే రూ. 333 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. వెంటనే తదుపరి రోజు అంటే అక్టోబర్ 1న రూ. 86 కోట్ల సేల్స్ నమోదయ్యాయి. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి అమ్మకాలు రెట్టింపు అయ్యాయని అధికారులు చెబుతున్నారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు, మాంసం షాపులు మూసివేయడంతో ఒక రోజు విరామం లభించింది. అయితే శుక్రవారం (అక్టోబర్ 3) నుంచి మళ్లీ మద్యం సేల్స్ ఊపందుకునే అవకాశం ఉందని, ఈ ఒక్కరోజే రూ. 300 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
👉 పండుగ సీజన్ కారణంగా మద్యం అమ్మకాలు ఇంత రికార్డు స్థాయికి చేరుకున్నాయని అధికారులు భావిస్తున్నారు.




