
YSR Praja News Telugu : వికారాబాద్: అంబేద్కర్ అవార్డు గ్రహీత, ప్రముఖ సామాజిక నాయకులు కోళ్ల యాదయ్య వికారాబాద్ జిల్లా ప్రజలకు పవిత్ర శ్రీరామనవమి పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మ రక్షకుడైన శ్రీరాముని ఆదర్శప్రాయమైన జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, న్యాయం అనే ఉన్నత విలువల పునాదుల పై రాముని పరిపాలన సాగిందని, ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆకాంక్షించారు. సమాజంలో శాంతిభద్రతలు, సోదరభావం వెల్లివిరియాలని ఆయన కోరుకున్నారు.
సీతారాముల కరుణాకటాక్షాలతో వికారాబాద్ జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో సంతోషంగా ఉండాలని కోళ్ల యాదయ్య ప్రార్థించారు. పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన కోరారు.




